తెలుగు రాష్ట్రాల్లో పురుషులను కలవరపెడుతున్న ప్రోస్టేట్ క్యాన్సర్
Advertisement
- ఏపీ, తెలంగాణల్లో పెరుగుతున్న ప్రోస్టేట్ క్యాన్సర్ కేసులు
- వయసు పైబడిన వారిలోనే ఎక్కువగా కనిపిస్తున్న ముప్పు
- మూత్ర సంబంధిత సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దన్న వైద్యులు
- ముందస్తు పరీక్షలతోనే వ్యాధిని నయం చేయడం సులభం
తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో పురుషుల ఆరోగ్యాన్ని ప్రోస్టేట్ క్యాన్సర్ తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. పురుషుల్లో ఎక్కువగా నమోదవుతున్న టాప్ 4 క్యాన్సర్లలో ప్రోస్టేట్ క్యాన్సర్ ఒకటిగా నిలుస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. రెండు రాష్ట్రాల్లోనూ ఈ క్యాన్సర్ కేసులు వేగంగా పెరుగుతుండటంతో ఇది ఒక ప్రధాన ప్రజారోగ్య సమస్యగా మారుతోంది.
గణాంకాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లో 2026 సంవత్సరంలో పురుషులలో కొత్త క్యాన్సర్ కేసుల్లో ప్రొస్టేట్ క్యాన్సర్ వాటా 6.9 శాతంగా (సుమారు 2,020) ఉంది. రాష్ట్రంలో నోటి క్యాన్సర్, ఊపిరితిత్తులు, కొలొరెక్టల్ క్యాన్సర్ల తర్వాత ప్రొస్టేట్ క్యాన్సర్ నాలుగో స్థానంలో కొనసాగుతోంది. అలాగే తెలంగాణలో క్యాన్సర్ కేసుల్లో ప్రొస్టేట్ క్యాన్సర్ వాటా 6.1 శాతంగా (సుమారు 1,300 కేసులు) ఉంటుందని, ఇక్కడ కూడా ఇది నాల్గవ స్థానంలో ఉందని నివేదిక పేర్కొంది.
ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రధానంగా వయసు పైబడిన పురుషులలో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తిస్తే సరైన చికిత్స ద్వారా పూర్తి స్థాయిలో నయం చేసే అవకాశాలు మెరుగవుతాయి.
ప్రోస్టేట్ క్యాన్సర్‌కు సంబంధించి కొన్ని ప్రధాన హెచ్చరిక సంకేతాలు ఉన్నాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో తరచూ మూత్ర విసర్జన చేయాల్సి రావడం, మూత్ర విసర్జన ప్రారంభించడంలో ఇబ్బంది కలగడం, మూత్ర ప్రవాహం బలహీనంగా లేదా ఆగి ఆగి రావడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అలాగే మూత్రంలో గానీ, వీర్యంలో గానీ రక్తం పడటం, నడుము కింది భాగం, తుంటి లేదా కటి భాగంలో నిరంతరం నొప్పి కొనసాగడం వంటివి కూడా ఈ క్యాన్సర్ ప్రధాన లక్షణాలుగా ఉంటాయి.
అయితే ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రారంభ దశలో ఎటువంటి లక్షణాలు కనిపించకపోవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అంతేకాకుండా, పైన పేర్కొన్న లక్షణాలు కేన్సర్ కాని సాధారణ ప్రోస్టేట్ గ్రంథి పెరుగుదల (నాన్-క్యాన్సరస్ ఎన్‌లార్జ్‌మెంట్) ఉన్నప్పుడు కూడా కనిపించే అవకాశముంది. అందువల్ల పురుషులు మూత్ర సంబంధిత మార్పులను తేలికగా తీసుకోకుండా, అనుమానం వచ్చిన వెంటనే వైద్యులను సంప్రదించి సంబంధిత స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.