ఒక చేతిలో 6 నెలల పాప.. పార్లమెంటులో ప్రసంగం.. ఈ తల్లికి నెటిజన్ల ప్రశంసలు
Advertisement
- ఆరు నెలల కుమార్తెతో కలిసి ఆస్ట్రేలియా సెనేట్‌కు హాజరైన ఫాతిమా పేమాన్
- ఆన్‌లైన్ సేఫ్టీ బిల్లుపై బిడ్డను చేతుల్లోకి తీసుకునే ప్రసంగించిన సెనేటర్
- చిన్నారితో సరదాగా దోబూచులాడిన వెనుక సీటు సభ్యురాలు లిడియా థోర్ప్
- సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్న పార్లమెంట్ వీడియో
- నిబంధనల ప్రకారం చట్టసభల్లోకి పిల్లలను అనుమతిస్తున్న ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో ఒక అరుదైన, హృద్యమైన దృశ్యం చోటుచేసుకుంది. పశ్చిమ ఆస్ట్రేలియాకు చెందిన ఇండిపెండెంట్ సెనేటర్ ఫాతిమా పేమాన్ తన ఆరు నెలల కుమార్తెను ఎత్తుకుని చట్టసభలో ప్రసంగించి అందరి దృష్టినీ ఆకర్షించారు. రాజకీయ బాధ్యతలను నిర్వర్తిస్తూనే మాతృత్వాన్ని సమర్థంగా బ్యాలెన్స్ చేయవచ్చని ఆమె నిరూపించారు.
ఆస్ట్రేలియా సెనేట్‌లో నవంబర్ 25న 'ఆన్‌లైన్ సేఫ్టీ అమెండ్‌మెంట్ (డిజిటల్ డ్యూటీ ఆఫ్ కేర్) బిల్లు 2026'పై కీలక చర్చ జరిగింది. ఈ సందర్భంగా సెనేటర్ ఫాతిమా పేమాన్ తన ఆరు నెలల కుమార్తె ఆలియాను చేతుల్లోకి తీసుకుని డిస్పాచ్ బాక్స్ వద్ద నిల్చున్నారు. ఒకవైపు చిన్నారిని ప్రేమగా లాలిస్తూనే, మరోవైపు బిల్లుపై తన వాదనలను వినిపించారు.
ఈ సమయంలో ఫాతిమా వెనుక సీట్లో కూర్చున్న మరో ఇండిపెండెంట్ సెనేటర్ లిడియా థోర్ప్.. ఆ చిన్నారితో సరదాగా దోబూచులాడుతూ (పీక్-ఎ-బూ) మురిపించారు. పార్లమెంట్ చర్చల మధ్య చోటుచేసుకున్న ఈ ఆహ్లాదకరమైన సన్నివేశం తాలూకు వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.
పశ్చిమ ఆస్ట్రేలియా నుంచి పదవిలో ఉండగానే బిడ్డకు జన్మనిచ్చిన మొదటి మహిళా సెనేటర్‌గా ఫాతిమా పేమాన్ గుర్తింపు పొందారు. ఆమె కుమార్తె 2026 మే నెలలో జన్మించింది. గతంలో కూడా ఆమె పార్లమెంట్ వేదికగా మాతృత్వపు అనుభవాలు, ప్రసవానంతర సవాళ్లు, పేరెంటింగ్‌లోని శారీరక, మానసిక ఒత్తిళ్లు మరియు విధుల్లోకి తిరిగి చేరడం వంటి అంశాలపై పలుమార్లు మాట్లాడారు.
ఆస్ట్రేలియా సెనేట్ నిబంధనల ప్రకారం మహిళా ఎంపీలు తమ చంటిపిల్లలను సభలోకి తీసుకురావడానికి వెసులుబాటు ఉంది. 2016లో సవరించిన నిబంధనల (స్టాండింగ్ ఆర్డర్స్) ప్రకారం.. సభా కార్యక్రమాలకు అంతరాయం కలగకుండా, సెనేట్ ప్రెసిడెంట్ అనుమతితో చిన్నపిల్లలను సభలోకి తీసుకురావడమే కాకుండా వారికి పాలివ్వడానికి కూడా అనుమతిస్తారు.
చట్టసభల్లో మహిళలకు అనుకూలమైన వాతావరణం కల్పించడం, రాజకీయాల్లో మాతృత్వాన్ని సాధారణ అంశంగా మార్చడంలో ఈ పరిణామం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుందని పలువురు ప్రశంసిస్తున్నారు. బాధ్యతను, బంధాన్ని ఏకకాలంలో చక్కగా నిర్వర్తించిన ఫాతిమా పేమాన్‌పై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.