సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లను పట్టించుకోకపోతే కొంపకొల్లేరే.. కంపెనీలకు సిస్కో సీఈవో చక్ రాబిన్స్ హై అలర్ట్!
Advertisement
- ఏఐ సాయంతో దాడులను ముమ్మరం చేస్తున్న సైబర్ నేరగాళ్లు
- స్పందించే వేగం కంటే హ్యాకింగ్ వేగమే అధికమన్న సిస్కో సీఈవో
- తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన ఏసీఐ నివేదిక
- సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు ఆలస్యం చేయడం వల్ల పెరుగుతున్న ముప్పు
- కీలక మౌలిక వసతుల రక్షణపై సీఈవోలు దృష్టి పెట్టాలని పిలుపు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో సైబర్ నేరగాళ్లు భద్రతా లోపాలను వేగంగా గుర్తిస్తూ, సంస్థల రక్షణ వ్యవస్థల కంటే ముందే దాడులకు తెగబడుతున్నారని సిస్కో సిస్టమ్స్ సీఈవో చక్ రాబిన్స్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. సంస్థలు తమ వ్యవస్థలను అప్‌గ్రేడ్ చేసుకునే వేగం కంటే హ్యాకర్ల దాడి వేగమే ఎక్కువగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్పొరేట్ దిగ్గజాలు, పరిశ్రమల అధినేతలు వెంటనే సైబర్ భద్రతను పటిష్ఠం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ మేరకు 'అలయన్స్ ఫర్ క్రిటికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్' (ఏసీఐ) విడుదల చేసిన మార్గదర్శకాలను సమర్థిస్తూ ఆయన ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. సంస్థలు తమ లోపాలను సరిదిద్దుకునే లోపే సైబర్ ముఠాలు ఏఐ ద్వారా లొసుగులను కనిపెట్టి నెట్‌వర్క్‌లను హ్యాక్ చేస్తున్నాయని రాబిన్స్ పేర్కొన్నారు. మనకు ఇంకా సమయం ఉన్నప్పుడే మేల్కొని తగిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.
ఏళ్ల తరబడి సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు, సెక్యూరిటీ ప్యాచులు వేయకుండా పాత సాంకేతికతను వాడటం వల్ల సంస్థల్లో 'టెక్నికల్ డెట్' పేరుకుపోయిందని నివేదిక స్పష్టం చేసింది. ఈ బలహీనతలను ఆసరాగా చేసుకుని ఏఐ ఆధారిత టూల్స్‌తో నేరగాళ్లు దాడులను ఆటోమేట్ చేస్తున్నారని తెలిపింది. డేటా సెంటర్లు, టెలికాం, విద్యుత్ గ్రిడ్లు, నీటి సరఫరా వంటి కీలక మౌలిక సదుపాయాలపై సైబర్ దాడులు జరిగితే నేరుగా ప్రజా జీవితం, ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటాయని ఏసీఐ హెచ్చరించింది. రాబోయే 30 రోజుల్లోగా క్రిటికల్ అసెట్స్ గుర్తింపు, త్వరితగతిన సెక్యూరిటీ రెస్పాన్స్, రికవరీ సామర్థ్యాలను పరిశీలించుకోవాలని సంస్థల సీఈవోలను కోరింది.