బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావం.. ఏపీలో రేపు కూడా వర్షాలు
Advertisement
- ఏపీలో రానున్న నాలుగు రోజులు వర్షాలు
- పిడుగులు పడే అవకాశం ఉండటంతో అధికారుల హెచ్చరిక
- రేపు పలు జిల్లాల్లో మోస్తరు వర్ష సూచన
- ఉరుముల సమయంలో చెట్ల కింద ఉండవద్దని సూచన
బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో రానున్న నాలుగు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్‌డీఎంఏ) వెల్లడించింది. వర్షాలతో పాటు కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులు పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఏపీలో ఇవాళ పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. ప్రకాశం జిల్లా ఒంగోలులో రోడ్లపై మోకాలి లోతున నీరు నిలిచింది. నెల్లూరులోనూ వర్షపాతం నమోదైంది.
వాతావరణ శాఖ వివరాల ప్రకారం, నైరుతి బంగాళాఖాతం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు తూర్పు గాలుల ద్రోణి విస్తరించి ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. రానున్న 24 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే వీలుంది. వీటితో పాటు మిగిలిన జిల్లాల్లోనూ అక్కడక్కడ చెదురుమదురు జల్లులు పడే అవకాశముందని అధికారులు తెలిపారు.
వాతావరణంలో చోటుచేసుకుంటున్న ఈ మార్పుల దృష్ట్యా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురుగాలులు వీచే సమయంలో ప్రజలు ఎవరూ చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్ల సమీపంలో ఉండవద్దని స్పష్టం చేసింది. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల కాపరులు వర్షం పడే సమయంలో సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని విజ్ఞప్తి చేసింది. అత్యవసరమైతే తప్ప వర్షం, పిడుగుల సమయంలో బయటకు రావద్దని సూచించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు, అధికారులు ఎప్పటికప్పుడు తాజా వాతావరణ హెచ్చరికలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు.