గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష.. ఇతర రాష్ట్రాల సీఎంలకూ ఆహ్వానం
Advertisement
- డిసెంబర్ 7 నుంచి 9 వరకు గ్లోబల్ సమ్మిట్ నిర్వహణ
- భారత్ ఫ్యూచర్ సిటీలోని స్కిల్స్ వర్సిటీలో ఏర్పాట్లు
- 80 వేల చదరపు మీటర్లలో భారీ మల్టీ సెక్టార్ ఎక్స్‌పో
- వెయ్యికి పైగా దేశ విదేశీ సంస్థల ప్రతినిధుల రాక
- ఎయిర్ షో, క్లైమేట్ కాంక్లేవ్, ఎడ్యుకేషన్ ఎక్స్‌పోల నిర్వహణ
రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడులను భారీగా ఆకర్షించడమే లక్ష్యంగా ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026’ను నిర్వహించనుంది. ‘భారత్ ఫ్యూచర్ సిటీ’లోని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ప్రాంగణంలో డిసెంబర్ 7 నుంచి 9 వరకు మూడు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. సుమారు 80 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో అతిపెద్ద బహుళ రంగాల ఎక్స్‌పోగా దీనిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ మెగా ఈవెంట్ ఏర్పాట్ల పురోగతిపై ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
సమ్మిట్ ప్రాంగణంలో వేదికలు, వివిధ సెక్టార్ల హాల్స్ నిర్మాణం, అంతర్జాతీయ ప్రతినిధుల ఆహ్వానాలు, కార్యక్రమాల నిర్వహణపై అధికారులకు సీఎం పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా రక్షా ఎక్స్‌పో, ఇండియా జాయ్, స్టార్టప్ పెవిలియన్, ఫార్మా అండ్ లైఫ్ సైన్సెస్ ఎక్స్‌పో, వ్యవసాయ అనుబంధ రంగాల ప్రదర్శన, తెలంగాణ పెవిలియన్, ఎడ్యుకేషన్ ఎక్స్‌పో, క్లైమేట్ కాంక్లేవ్‌లను సమర్థంగా నిర్వహించాలని సూచించారు.
దాదాపు వెయ్యికి పైగా ప్రముఖ కంపెనీల ప్రతినిధులు హాజరుకానున్న నేపథ్యంలో వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా ప్రవేశం కల్పించాలని తెలిపారు. అలాగే విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది ప్రతినిధులతో ఎంతో మర్యాదగా వ్యవహరించేలా ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని స్పష్టం చేశారు.
ఈ అంతర్జాతీయ సదస్సులో తెలంగాణ చరిత్ర, సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు. కాకతీయుల శిల్పకళ, సమ్మక్క సారలమ్మ ఆలయ తోరణాల నమూనాలు, సోమశిల ఆలయం, నిర్మల్ పెయింటింగ్స్, భౌగోళిక గుర్తింపు (జీఐ) పొందిన ఉత్పత్తులు, చేనేత కళా వైభవాన్ని ప్రతిబింబించేలా స్టాళ్లను తీర్చిదిద్దాలని చెప్పారు. రాష్ట్ర ప్రగతితో పాటు భవిష్యత్ ప్రాజెక్టు అయిన ‘గాంధీ సరోవర్’ ప్రణాళికలను కూడా ఇక్కడ ప్రదర్శించనున్నారు.
డిసెంబర్ 7న ఆర్మ్‌డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే సందర్భంగా రక్షా ఎక్స్‌పోలో భాగంగా ప్రత్యేక కార్యక్రమాలతో పాటు ఎయిర్ షో నిర్వహించనున్నారు. ఈ వైమానిక ప్రదర్శనను వీక్షించేందుకు ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి సూచించారు.
మరోవైపు క్లైమేట్ కాంక్లేవ్‌లో సద్గురు జగ్గీ వాసుదేవ్, ఐక్యరాజ్యసమితి ప్రతినిధులు, అంతర్జాతీయ స్థాయి నిపుణులు ప్రసంగించనున్నారు. గ్రీన్ ఎకానమీపై రౌండ్ టేబుల్ సమావేశంతో పాటు ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు, స్టార్టప్‌లు ఇందులో భాగస్వామ్యం కానున్నాయి.
ఎడ్యుకేషన్ కాంక్లేవ్‌లో ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంతో పాటు యూకే, యూరోపియన్ పెవిలియన్లను ఏర్పాటు చేస్తున్నారు. స్థానికంగా ఉన్న ఐఎస్‌బీ, ఐఐటీ హైదరాబాద్, నల్సార్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రతినిధులు విదేశీ నిపుణులతో చర్చలు జరపనున్నారు.
డిసెంబర్ 7న ‘స్కూల్స్ ఆఫ్ ది ఫ్యూచర్’, 8న ‘విద్యాసంస్థల్లో సంస్కరణలు’ అనే అంశాలపై జరిగే ప్రత్యేక చర్చల్లో ముఖ్యమంత్రి స్వయంగా పాల్గొంటారు. మీడియా, గేమింగ్ రంగానికి చెందిన ‘ఇండియా జాయ్ 2026’ వేదికపై అడోబ్, సోనీ, ఉబిసాఫ్ట్ వంటి సుమారు 150 ఏవీజీసీ కంపెనీలు తమ ప్రదర్శనలను ఇవ్వనున్నాయి.
ముఖ్యమైన అంతర్జాతీయ ప్రతినిధులతో పాటు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా ఈ సమ్మిట్‌కు ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆహ్వానాల ప్రక్రియ బాధ్యతలను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబులకు అప్పగించారు. ఈ సమీక్షా సమావేశంలో పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.