పాక్ సైన్యం ఖనిజ దోపిడీ.. ఐరాసలో దాయాది బండారం బయటపెట్టిన భారత్
Advertisement
- ప్రజల మేలు కోసం కాకుండా స్వార్థానికే ఖనిజాల వినియోగం
- విదేశీ నేతలకు ఖనిజాల పెట్టె చూపించిన ఆసిమ్ మునీర్
- గనుల కోసమే ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రభుత్వ రద్దు
- ప్రావిన్స్‌లో ఎమర్జెన్సీ వెనుక ఆర్మీ అత్యాశ ఉందన్న హరీశ్
- స్వార్థం వీడి ప్రజలకు మేలు చేయాలని పాక్ సైన్యానికి హితవు
పాకిస్థాన్ సహజ వనరులను ఆ దేశ సైన్యం స్వప్రయోజనాల కోసం ఏ విధంగా కొల్లగొడుతోందో ఐక్యరాజ్యసమితి వేదికగా భారత్ ఎండగట్టింది. ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలేసి మిలిటరీ పెద్దలు దేశ సంపదతో జేబులు నింపుకుంటున్నారని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి పి.హరీశ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
వచ్చే నెల భద్రతా మండలి అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న లైబీరియా ‘సహజ వనరులు-సంఘర్షణ: నివారణ, శాంతి కోసం సహకారాన్ని బలోపేతం చేయడం’ అనే అంశంపై నిర్వహించిన అనధికారిక సమావేశంలో హరీశ్ ప్రసంగించారు. గతేడాది సెప్టెంబరులో పాక్ సైన్యాధ్యక్షుడు ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ చెక్క పెట్టెలో ఖనిజాలను పెట్టి విదేశీ నేతలకు చూపించిన ఉదంతాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. దేశ సహజ వనరుల దోపిడీలో పాక్ సైన్యం ప్రత్యక్ష ప్రమేయానికి ఇదే స్పష్టమైన నిదర్శనమని విమర్శించారు.
ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో పాకిస్థాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ ప్రభుత్వాన్ని రద్దు చేయడం, అక్కడ ఎమర్జెన్సీ విధించడం వెనుక కూడా సైన్యం అత్యాశే కారణమని హరీశ్ ఆరోపించారు. అక్కడి గనుల సంపదను హస్తగతం చేసుకోవడానికే ఈ కుట్ర పన్నారని పేర్కొన్నారు. పాకిస్థాన్‌కు అసలైన పాలకులుగా ఉన్న సైన్యాధికారులు తమ స్వార్థం కోసం కాకుండా, దేశ ప్రజల సంక్షేమం కోసం ఆ వనరులను వినియోగిస్తే బాగుంటుందని హితవు పలికారు.
మరోవైపు, సమావేశాన్ని దుర్వినియోగం చేస్తూ పాక్ ప్రతినిధి ఉస్మాన్ జాదూన్.. సింధు జలాల ఒప్పందం అంశాన్ని లేవనెత్తగా భారత్ గట్టిగా తిప్పికొట్టింది. పాకిస్థాన్ తన తప్పుడు ప్రచారానికి ఐరాస వేదికను వాడుకుంటోందని హరీశ్ మండిపడ్డారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం ఆపేంతవరకు సింధు ఒప్పందం నిలిచి ఉంటుందని స్పష్టం చేశారు.