పోర్చుగల్‌లో భగ్గుమన్న గృహ సంక్షోభం.. 30 నగరాల్లో రోడ్లపైకి వేలాది మంది ప్రజలు
Advertisement
- పోర్చుగల్‌లో ఇళ్ల ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా భారీ నిరసనలు
- అద్దెల నియంత్రణ, అద్దెదారులకు రక్షణ కల్పించాలని వేలాది మంది డిమాండ్
- 2020 నుంచి అద్దెల వ్యయంలో ఏకంగా 68 శాతం పెరుగుదల నమోదు
పోర్చుగల్‌లో విపరీతంగా పెరిగిపోతున్న ఇళ్ల ధరలు, అద్దెలకు వ్యతిరేకంగా ప్రజాగ్రహం వెల్లువెత్తింది. దేశవ్యాప్తంగా 30కి పైగా నగరాలు, పట్టణాల్లో వేలాది మంది వీధుల్లోకి వచ్చి భారీ ప్రదర్శనలు చేపట్టారు. దేశ చరిత్రలోనే నివాస హక్కుల కోసం జరిగిన అతిపెద్ద నిరసనగా ఇది నిలిచింది. లిస్బన్, పోర్టో వంటి ప్రధాన నగరాల్లో విద్యార్థులు, యువత నుంచి పదవీ విరమణ చేసిన వృద్ధుల వరకు అందరూ రోడ్లపైకి వచ్చారు. ‘మా నివాస హక్కును లాక్కోనివ్వం’, ‘అద్దెలు తగ్గించండి.. వేతనాలు పెంచండి’ అంటూ నిరసనకారులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
యూరోస్టాట్ గణాంకాల ప్రకారం... 2015 నుంచి 2025 మధ్య పోర్చుగల్‌లో సాధారణ ప్రజల ఆదాయంతో పోలిస్తే ఇళ్ల ధరలు ఏకంగా 61 శాతం పెరిగాయి. యూరోపియన్ యూనియన్‌లోనే ఇది అత్యధిక పెరుగుదల కావడం గమనార్హం. కేవలం 2025 తొలి త్రైమాసికం నుంచి 2026 తొలి త్రైమాసికం మధ్యే ఇళ్ల ధరలు దాదాపు 20 శాతం పెరిగాయని జాతీయ గణాంకాల సంస్థ వెల్లడించింది. మరోవైపు 2020 నుంచి ఇప్పటివరకు అద్దెలు 68 శాతం పెరిగినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
విదేశీ కొనుగోలుదారులు, ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్స్, డిజిటల్ నోమాడ్స్ తాకిడి పెరగడం, పర్యాటకం కారణంగా ఇళ్లను స్వల్పకాలిక అద్దెలకు ఇవ్వడం వంటి అంశాలు ఈ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేశాయి. దీనికితోడు యజమానులు అద్దెదారులను త్వరగా ఖాళీ చేయించేందుకు వీలుగా ప్రభుత్వం ఇటీవల తెచ్చిన నూతన బిల్లు ప్రజల ఆగ్రహాన్ని మరింత పెంచింది.
ప్రజల ఆందోళనల నేపథ్యంలో పోర్చుగల్ అధ్యక్షుడు ఆంటోనియో జోస్ సెగురో ఉన్నత స్థాయి మండలితో సమావేశమై చర్చలు జరిపారు. కొందరు నిరసనకారులను కూడా ఆయన స్వయంగా కలిశారు. సంక్షోభాన్ని అదుపు చేసేందుకు కొత్త నిర్మాణాలకు పన్ను రాయితీలు ఇవ్వడంతో పాటు 1,45,000 కొత్త ఇళ్లను నిర్మిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే ఈ చర్యల ఫలితాలు కనిపించడానికి సమయం పడుతుందని అధికారులు స్పష్టం చేశారు.