రూ.20 వసూలు చేసినందుకు రూ.13,000 ఫైన్.. రైల్వే పార్కింగ్ సిబ్బందికి బుద్ధి చెప్పిన వినియోగదారుల కమిషన్
Advertisement
- తమిళనాడులోని రాజపాళయం రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకున్న ఘటన
- డ్రాప్-ఆఫ్ లేన్‌లో ఉన్న వాహనం నుంచి అక్రమంగా రూ.20 వసూలు
- బాధితుడికి రూ.13 వేల నష్టపరిహారం చెల్లించాలని కమిషన్ ఆదేశం
- పార్కింగ్ స్థలం దాటి రోడ్లపై వసూళ్లు చేయడం చట్టవిరుద్ధమని స్పష్టీకరణ
- ఉచిత సమయం నిబంధనలను ఉల్లంఘించినందుకు ఫోరం ఆగ్రహం
రైల్వే స్టేషన్ వద్ద కుటుంబ సభ్యులను పికప్ చేసుకునేందుకు వెళ్లిన ఓ యువకుడి నుంచి అక్రమంగా రూ.20 పార్కింగ్ రుసుము వసూలు చేసిన వ్యవహారంలో రైల్వే శాఖ, పార్కింగ్ కాంట్రాక్టర్‌కు తమిళనాడు వినియోగదారుల కమిషన్ భారీ షాక్ ఇచ్చింది. బాధితుడి నుంచి తీసుకున్న రూ.20 రీఫండ్ చేయడంతో పాటు, అతనికి కలిగించిన మానసిక వేదనకు రూ.10,000, న్యాయ పోరాటం ఖర్చుల కింద మరో రూ.3,000 కలిపి మొత్తం రూ.13,000 పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది.
గతేడాది డిసెంబర్ 20న తమిళనాడులోని రాజపాళయం రైల్వే స్టేషన్‌కు (దక్షిణ రైల్వే, మధురై డివిజన్) ఓ న్యాయ విద్యార్థి తన వృద్ధ తల్లిదండ్రులు, తాతామామ్మలను పికప్ చేసుకునేందుకు కారులో వెళ్లాడు. అతను తన కారు ఇంజిన్ ఆపకుండా, ట్రాఫిక్‌కు అనుగుణంగా కేటాయించిన డ్రాప్-ఆఫ్ (సర్క్యులేషన్) ఏరియాలోనే ముందుకు కదులుతూ ఉన్నాడు. అసలు వాహనాన్ని ఎక్కడా నిలపలేదు, పార్కింగ్ స్థలంలోకి కూడా తీసుకెళ్లలేదు.
అయినప్పటికీ, పార్కింగ్ కాంట్రాక్టర్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు అతడిని అడ్డుకుని, నిబంధనలకు విరుద్ధంగా ‘6 నిమిషాల రూల్’ పేరుతో రూ.20 చెల్లించాలని డిమాండ్ చేశారు. డబ్బులు ఇచ్చేందుకు నిరాకరిస్తే రైల్వే చట్టం సెక్షన్ 159 కింద రూ.500 జరిమానా విధిస్తామని బెదిరించారు. వారిలో ఒకరు దక్షిణ రైల్వే లోగో ఉన్న గుర్తింపు కార్డు చూపించడంతో, ఒత్తిడికి గురైన సదరు విద్యార్థి రూ.20 చెల్లించి రసీదు తీసుకున్నాడు. తన కుటుంబ సభ్యుల ముందే సిబ్బంది హేళన చేస్తూ మాట్లాడారని, బహిరంగంగా అవమానించారని ఆరోపిస్తూ బాధితుడు వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించాడు.
ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కమిషన్ బెంచ్ (ప్రెసిడెంట్ ఎస్.జె. చక్రవర్తి, సభ్యురాలు ఎం. ముత్తులక్ష్మి) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్కింగ్ కాంట్రాక్టర్ పరిధి కేవలం కేటాయించిన పార్కింగ్ స్థలానికి మాత్రమే పరిమితమని, పబ్లిక్ రోడ్లు లేదా డ్రాప్-ఆఫ్ లేన్లలోకి రాదని స్పష్టం చేసింది. దక్షిణ రైల్వే నిబంధనల ప్రకారం డ్రాప్-ఆఫ్ జోన్‌లో ప్రయాణికులను దింపేందుకు లేదా ఎక్కించుకునేందుకు 6 నిమిషాల వరకు ఉచిత సమయం ఉంటుందని, ఆ సమయంలో వాహనాల నుంచి రుసుము వసూలు చేసే హక్కు కాంట్రాక్టర్‌కు లేదని పేర్కొంది.
కారును పార్క్ చేయనప్పుడు ఫీజు డిమాండ్ చేయడం వినియోగదారుల రక్షణ చట్టం ప్రకారం 'అన్యాయమైన వ్యాపార పద్ధతి' అని తేల్చింది. వాహనం ఎంట్రీ, ఎగ్జిట్ సమయాలను సరిచూడకుండా మాన్యువల్‌గా డబ్బులు వసూలు చేయడం నిబంధనల ఉల్లంఘనే అని పేర్కొంటూ.. రైల్వే అధికారులు, కాంట్రాక్టర్ ఆరు వారాల్లోగా బాధితుడికి పరిహారం చెల్లించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.