Advertisement

హైదరాబాద్ సీపీగా బాధ్యతలు స్వీకరించిన మహేశ్ భగవత్

Telangana
Advertisement
  • పోలీస్ కమిషనరేట్ లో పదవీ బాధ్యతలను స్వీకరించిన మహేశ్ భగవత్
  • శాంతిభద్రతలు, మహిళా భద్రత, ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికే తొలి ప్రాధాన్యమని వెల్లడి
  • భూ తగాదాలు, పదేపదే నేరాలకు పాల్పడేవారిపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని హెచ్చరిక
హైదరాబాద్ నగర నూతన పోలీస్ కమిషనర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి మహేశ్ భగవత్ బాధ్యతలు స్వీకరించారు. పోలీస్ కమిషనరేట్ లోని తన ఛాంబర్ లో సంబంధిత ఫైళ్లపై సంతకాలు చేసి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా తనకు అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.

బాధ్యతల స్వీకరణ అనంతరం నూతన సీపీ మహేశ్ భగవత్ మీడియాతో మాట్లాడుతూ తమ ప్రాధాన్యతలను స్పష్టం చేశారు. “హైదరాబాద్‌లో శాంతి భద్రతలు, మహిళా భద్రత, ట్రాఫిక్ వంటివి కీలక అంశాలు. ప్రతి ఏటా 1.80 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారు. అందుకే ఈ అంశాలకు మేము ప్రాధాన్యమిస్తాం. మరోవైపు భూమి విలువ పెరగడం వల్ల భూ తగాదాల్లో దాడులు జరుగుతున్నాయి. వీటిపై కఠిన చర్యలు తీసుకుంటాం” అని తెలిపారు.

నగరంలో పదేపదే నేరాలకు పాల్పడే అలవాటున్న నేరగాళ్లపై అవసరమైతే పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని ఆయన హెచ్చరించారు. హైదరాబాద్‌లో సైబర్ నేరాల కట్టడి, డయల్ 100, 112 ఎమర్జెన్సీ సేవల బలోపేతం, విజిబుల్ పోలీసింగ్, కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాలను మరింత సమర్థంగా ముందుకు తీసుకెళతామని చెప్పారు.
Advertisement

సంబంధిత వార్తలు

మీ కోసం మరిన్ని

Mahesh BhagwatHyderabad Police CommissionerHyderabad CPTelangana Police

More Telugu News

ఎల్‌నినోతో హెల్త్‌ ఎమర్జెన్సీ.. భారత్‌కు డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరిక

13 Nov, 17:29

కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్‌ను కలిసిన మాజీ మంత్రి బుగ్గన

13 Nov, 17:25

మార్కెట్లలో మళ్లీ అమ్మకాల సెగ.. సెన్సెక్స్‌ 318 పాయింట్లు డౌన్

13 Nov, 17:22

అసోంలో ఘోర రోడ్డు ప్రమాదం.. 23 మంది దుర్మరణం

13 Nov, 17:18

ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఎల్లుండికి వాయుగుండంగా బలపడే అవకాశం

13 Nov, 16:45

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై సీఎం చంద్రబాబుపై మండిపడ్డ వైఎస్ షర్మిల

13 Nov, 16:37

నాటి ఆలోచన మార్చుకున్నా.. జనాభా విధానంపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

13 Nov, 16:35

భార్యతో గొడవపై పాట్‌ కమిన్స్‌ క్లారిటీ.. అసలు కారణం ఉస్మాన్‌ ఖవాజా!

13 Nov, 16:34

ఏపీ అడవుల నుంచి తెలంగాణలోకి ప్రవేశించిన పెద్దపులి.. సరిహద్దు గ్రామాల్లో భయాందోళన

13 Nov, 16:20

ఎవరూ కావాలని వికెట్ పారేసుకోలేదు: నాలుగో వన్డేలో ఘోరపరాజయంపై శ్రేయస్ కామెంట్స్

13 Nov, 16:18

కంగనా రనౌత్ 'స్కేరీ పిక్చర్' టైటిల్ పోస్టర్ విడుదల చేసిన రానా దగ్గుబాటి.. బాలీవుడ్ లో రవిబాబు ఎంట్రీ

13 Nov, 16:09

మైక్రోసాఫ్ట్‌ సేవల్లో అంతరాయానికి అసలు కారణమేంటి? పునరుద్ధరణకు ఎందుకింత సమయం పడుతోంది?

13 Nov, 16:06

ఇంటికో పారిశ్రామికవేత్తను తయారుచేయడమే ఏపీ లక్ష్యం: మంత్రి నారా లోకేశ్

13 Nov, 15:50

హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు రూ.1.59 కోట్ల టోకరా.. పోలీసులకు ఫిర్యాదు

13 Nov, 15:49
..More Telugu News