కాంగ్రెస్, బీజేపీతో నాకు సంబంధం లేదు.. సోనియా పుస్తకంపై అన్నా హజారే కీలక వ్యాఖ్యలు
Advertisement
- 2011లో అన్నా హజారే ఉద్యమాన్ని తన పుస్తకంలో ప్రస్తావించిన సోనియా
- అవినీతి వ్యతిరేక ఉద్యమానికి బీజేపీ, ఆర్ఎస్ఎస్ మద్దతు ఉందని వ్యాఖ్య
- తనకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదంటూ హజారే కౌంటర్
- దేశం, సమాజం గురించే ఆలోచిస్తానని వ్యాఖ్య
- దేశం, సమాజ పరిస్థితులపై దృష్టి పెట్టాలని సోనియాకు హితవు
2011లో తన నేతృత్వంలో సాగిన అవినీతి వ్యతిరేక ఉద్యమంపై సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలను సామాజిక కార్యకర్త అన్నా హజారే తప్పుబట్టారు. రాజకీయ పార్టీల గురించి కాకుండా దేశం, సమాజం పరిస్థితులపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. తనకు కాంగ్రెస్, బీజేపీతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
సోనియా గాంధీ ఇటీవల రాసిన ‘బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్’ పుస్తకంలో అన్నా హజారే ఉద్యమాన్ని ప్రస్తావించారు. 2011లో ఆయన నేతృత్వంలో సాగిన ‘ఇండియా ఎగైనెస్ట్ కరప్షన్’ ఉద్యమానికి బీజేపీ, ఆర్ఎస్ఎస్ నుంచి తెరవెనక మద్దతు లభించిందని ఆ ఉద్యమంలో పాల్గొన్న కొందరు ప్రముఖులు తర్వాత చెప్పినట్లు ఆమె పేర్కొన్నారు. భారీ ప్రచారం నడుమ అన్నా హజారే ఢిల్లీకి వచ్చి నిరాహార దీక్ష చేపట్టారని రాశారు. ఈ ఉద్యమం కారణంగా అప్పటి యూపీఏ ప్రభుత్వం, కాంగ్రెస్ ఇబ్బందుల్లో పడ్డాయని వివరించారు. యూపీఏ ప్రభుత్వాన్ని గద్దె దించడమే ప్రత్యర్థుల లక్ష్యమని పేర్కొన్నారు. అది నెరవేరిన తర్వాత అన్నా హజారే గురించి ఎవరూ మాట్లాడలేదని ఆమె తన పుస్తకంలో రాశారు.
ఈ వ్యాఖ్యలపై బుధవారం మహారాష్ట్రలోని అహిల్యానగర్‌లో అన్నా హజారే స్పందించారు. తన ఉద్యమం కారణంగా ఆర్ఎస్ఎస్, బీజేపీకి చెందిన పలువురు కూడా పదవులు కోల్పోయాని వ్యాఖ్యానించారు. తనకు రాజకీయ పార్టీల కంటే సమాజం, దేశ ప్రయోజనాలే ముఖ్యమన్నారు. కరవు సమయంలో బాధితుల కోసం తన పింఛను డబ్బులను ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి అంశాలపై దృష్టి పెట్టి సమాజం కోసం పనిచేయాలని సూచించారు.
ఫలాలిచ్చే చెట్టుకే రాళ్ల దెబ్బలు తగులుతాయని హజారే వ్యాఖ్యానించారు. తన జీవితాన్ని సమాజం, దేశం కోసమే అంకితం చేశానన్నారు. విమర్శలను పట్టించుకోకుండా తన బాధ్యతను కొనసాగిస్తానని చెప్పారు. త్వరలో విడుదల కానున్న ‘అన్నా హజారే: గ్రామయోగి’ పుస్తకంలో తన జీవిత విశేషాలు ఉంటాయని వెల్లడించారు.