తెలంగాణ బిడ్డలు అగ్ర దేశాలతో పోటీపడేలా విద్యా సంస్కరణలు: భట్టి విక్రమార్క
Advertisement
- కాజీపేటలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన భట్టి విక్రమార్క
- సుమారు రూ.11 కోట్ల వ్యయంతో అందుబాటులోకి రానున్న నూతన పాఠశాల భవనం
- పేద బిడ్డలకు ప్రపంచ స్థాయి విద్యను అందించడమే లక్ష్యమన్న డిప్యూటీ సీఎం
తెలంగాణ బిడ్డలు ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదిగేలా రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోందని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. హనుమకొండ జిల్లా కాజీపేటలోని విద్యానగర్‌లో నూతన ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్’ భవన నిర్మాణానికి ఆయన ఈరోజు శంకుస్థాపన చేశారు. స్థానిక బీసీ వెల్ఫేర్ బాలుర వసతిగృహం ప్రాంగణంలో సుమారు రూ.10 కోట్ల నుంచి రూ.11 కోట్ల అంచనా వ్యయంతో ఈ పాఠశాల భవనాన్ని నిర్మించనున్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో డిప్యూటీ సీఎం మాట్లాడుతూ... దేశంలో మరెక్కడా లేని విధంగా రాష్ట్రంలో ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్’, ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్స్’ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు. ప్రపంచంలోని పది అగ్రదేశాలతో తెలంగాణ విద్యార్థులు పోటీపడేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యావ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తూ పటిష్ఠపరుస్తున్నారని పేర్కొన్నారు.
కుటుంబ వ్యవస్థను బలోపేతం చేయడంలో భాగంగానే సెమీ రెసిడెన్షియల్ విధానంలో తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను అందుబాటులోకి తెస్తున్నట్లు భట్టి విక్రమార్క వివరించారు. ఈ పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు డిజిటల్ బోధన అందించడంతో పాటు ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రవాణా సదుపాయాలు కల్పిస్తామన్నారు. మరోవైపు, ఉపముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో హనుమకొండలో ముందస్తు చర్యగా మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్‌తో సహా పలువురు బీఆర్ఎస్ నాయకులను పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు.