గుండెపోటు అనుకుంటే హత్య: ప్రియుడితో కలిసి భర్తను అంతమొందించిన భార్య

National
Advertisement
  • గుండెపోటుగా చిత్రీకరించి తప్పించుకునేందుకు విఫలయత్నం
  • వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని దారుణం
  • పోస్టుమార్టం నివేదికతో వెలుగులోకి అసలు నిజం
  • భార్య, ఆమె ప్రియుడిని అరెస్ట్ చేసిన బెంగళూరు పోలీసులు
బెంగళూరులో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడన్న కారణంతో ప్రియుడితో కలిసి భర్తను హతమార్చి, దానిని గుండెపోటుగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన భార్యను, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఎలక్ట్రానిక్ సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని దొడ్డతొగురులో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఉపేంద్ర (41), అనిత (36) దంపతులు. అనితకు వారి స్వగ్రామానికే చెందిన మధుసూదన్ రెడ్డి (46)తో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం తెలుసుకున్న ఉపేంద్ర వారిద్దరినీ తీవ్రంగా హెచ్చరించాడు. దీంతో తమ బంధానికి అడ్డుగా ఉన్న ఉపేంద్రను అంతమొందించాలని అనిత, మధుసూదన్ నిర్ణయించుకున్నారు.

పథకం ప్రకారం, అక్టోబర్ 12వ తేదీ తెల్లవారుజామున ఉపేంద్రను ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. అనంతరం అతను బాత్రూమ్‌కు వెళ్తూ జారిపడి, గుండెపోటుతో మరణించాడని అందరినీ నమ్మించే ప్రయత్నం చేశారు. అయితే, ఉపేంద్ర సోదరుడి ఫిర్యాదుతో పోలీసులు దీనిని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.

పోస్టుమార్టం నివేదిక రావడంతో ఈ కేసు కీలక మలుపు తిరిగింది. నివేదిక ఆధారంగా అనుమానం వచ్చిన పోలీసులు, ఈ నెల 5న మధుసూదన్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా అతను నేరాన్ని అంగీకరించాడు. అతని సమాచారంతో మరుసటి రోజు అనితను కూడా అరెస్ట్ చేయగా, ఆమె సైతం నిజాన్ని ఒప్పుకుంది. దీంతో ఈ కేసును హత్య కేసుగా మార్చిన పోలీసులు, నిందితులిద్దరినీ కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుతం ఈ ఘటనపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.
Advertisement

సంబంధిత వార్తలు

మీ కోసం మరిన్ని

UpendraAnitaMadhusudan ReddyBangalore murder caseElectronic City policeExtramarital affair murder

More Telugu News

తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. వైద్యశాఖలో 2,929 పోస్టుల భర్తీకి రంగం సిద్ధం

10 Nov, 07:08

13 ఏళ్ల వైవాహిక బంధానికి పవన్, అన్నా స్వస్తి.. విడిపోతున్నట్టు ప్రకటన

10 Nov, 06:51

ఉద్యోగి 48 గంటలు కస్టడీలో ఉంటే సస్పెన్షన్ అయినట్లే: సుప్రీంకోర్టు

10 Nov, 06:30

పదవిని వీడే ముందు భారీగా క్షమాభిక్షలు: ట్రంప్ సంచలన ప్రకటన

10 Nov, 06:25

మీ వాహనం ఉందేమో చూసుకోండి!.. 510 వాహనాల వేలంపై మల్కాజ్‌గిరి పోలీసుల ప్రకటన

09 Nov, 22:52

అవకాశాల కల్పనలో ఏపీ మేటి.. యాక్సెస్ ఈక్వాలిటీ ఇండెక్స్‌లో రెండో స్థానం.. చంద్రబాబు స్పందన

09 Nov, 22:44

వనపర్తి జిల్లాలో 900 ఏళ్ల నాటి శాసనం.. వెలుగులోకి చారిత్రక నిజాలు

09 Nov, 22:38

నవంబరు 12, 13వ తేదీల్లో విశాఖలో సీఐఐ సదస్సు.. హాజరుకానున్న అమిత్ షా, గోయల్, చంద్రబాబు

09 Nov, 22:28

సామాన్యుడిపై మరో భారం.. డిసెంబర్ నుంచి చికెన్, గుడ్ల ధరల మోత!

09 Nov, 22:21

చారిత్రక బావులకు కొత్త ఊపిరి.. తెలంగాణలో మొదలైన 'మీ బావి' ఉద్యమం

09 Nov, 22:15

బేబీ బంప్ లేటెస్ట్ ఫొటో షేర్ చేసిన సమంత.. నెట్టింట వైరల్

09 Nov, 22:07

ప్రధాని మోదీతో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కీలక ఫోన్ సంభాషణ

09 Nov, 21:16

'డయాబెటిస్' లేకపోతే నా జీవితం ఎలా ఉండేదో!: నిక్ జోనాస్ బహిరంగ లేఖ

09 Nov, 20:36

రూ.500 నోట్లను రద్దు చేయాలి.. పెద్ద నోట్ల అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చిన చంద్రబాబు

09 Nov, 20:24
..More Telugu News