సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేస్తే మోదీ ఓటమి ఖాయం.. దీప్కే కీలక వ్యాఖ్యలు
Advertisement
- 2029లో ఎన్డీఏ ఓటమి తప్పదన్న అభిజీత్ దీప్కే
- సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్
- కొచ్చిలో ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా నిరసన
- ఎన్నికల వ్యవస్థ నిష్పక్షపాతంగా ఉండాలని డిమాండ్
- యువత హక్కులను ప్రభుత్వం నియంత్రిస్తోందని ఆరోపణ
2029 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఓటమి పాలవుతుందని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే జోస్యం చెప్పారు. కేంద్రంలో అధికార మార్పిడి జరగడం ఖాయమని వ్యాఖ్యానించారు. ఎన్నికల సంఘం స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా పనిచేయాలంటే ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
కేరళలోని కొచ్చిలో నిర్వహించిన ‘జంతర్ మంతర్ ఎట్ కొచ్చి’ నిరసన కార్యక్రమంలో దీప్కే మాట్లాడారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను వ్యతిరేకిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. 2029 ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని, అప్పుడే ప్రభుత్వ మార్పు జరుగుతుందని అన్నారు. ఎన్నికల ద్వారానే అధికార మార్పిడి సాధ్యమని స్పష్టం చేశారు. జ్ఞానేశ్ కుమార్ పదవి నుంచి తప్పుకొంటే ప్రధాని మోదీ కూడా అధికారం కోల్పోతారని వ్యాఖ్యానించారు.
ప్రభుత్వం యువతను లక్ష్యంగా చేసుకుంటోందని దీప్కే ఆరోపించారు. ప్రజలు ఏం తినాలి? ఎవరిని ప్రేమించాలి? ఎవరికి ఓటు వేయాలి? అనే విషయాలను కూడా నియంత్రించేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియను ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేందుకు ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. అంబేడ్కర్, గాంధీ, నెహ్రూ ఆశయాలే దేశానికి పునాదులని పేర్కొన్నారు.
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జాతీయ జెండాతో నిరసన తెలిపినందుకు తనతో పాటు పార్టీ నేతలు సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకాను అరెస్టు చేశారని గుర్తుచేశారు. ఎక్కడికి వెళ్లినా త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని నిరసన కొనసాగిస్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నటుడు ప్రకాశ్‌రాజ్ కూడా పాల్గొన్నారు. మెరైన్ డ్రైవ్ నుంచి రాజేంద్ర మైదాన్ వరకు నిరసన ర్యాలీకి ఆయన నాయకత్వం వహించారు.