చమురు శుద్ధిలో భారత్‌ దూకుడు.. అమెరికా, యూరప్‌పై వ్యూహాత్మక ఆధిక్యం

Business
Advertisement
  • చమురు శుద్ధి సామర్థ్యంలో భారత్‌కు ప్రపంచంలో నాలుగో స్థానం
  • ఏడాదికి 267.1 మిలియన్‌ టన్నుల ప్రస్తుత సామర్థ్యం
  • 2030 నాటికి 300 మిలియన్‌ టన్నుల లక్ష్యం
  • ముడి చమురు అవసరాల్లో 88 శాతం దిగుమతులపైనే ఆధారం
  • ఆరు నెలల్లో పెట్రోలియం ఎగుమతుల విలువ 27.2 బిలియన్‌ డాలర్లు
ముడి చమురు అవసరాల్లో దాదాపు 88 శాతం దిగుమతులపైనే ఆధారపడుతున్న భారత్‌.. శుద్ధి చేసిన పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతుల్లో మాత్రం ప్రపంచంలో కీలక శక్తిగా ఎదుగుతోంది. అమెరికా, ఐరోపా దేశాలు చమురు శుద్ధి సామర్థ్యాన్ని తగ్గించుకుంటుంటే.. భారత్‌ మాత్రం దాన్ని విస్తరిస్తోంది. దీంతో అంతర్జాతీయ చమురు మార్కెట్‌లో దేశానికి వ్యూహాత్మక ఆధిక్యం లభిస్తోందని ‘ఇండియా నెరేటివ్‌’ కథనం విశ్లేషించింది.

2026 ఏప్రిల్‌ నాటికి భారత్‌ చమురు శుద్ధి సామర్థ్యం ఏడాదికి 267.1 మిలియన్‌ టన్నులుగా ఉంది. రోజుకు సుమారు 53 నుంచి 56 లక్షల బ్యారెళ్లకు సమానమైన ఈ సామర్థ్యంతో ప్రపంచంలో నాలుగో స్థానంలో నిలిచింది. అమెరికా, చైనా, రష్యా తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. 2030 నాటికి శుద్ధి సామర్థ్యాన్ని 300 మిలియన్‌ టన్నులకు పెంచాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. దీర్ఘకాలంలో 400 మిలియన్‌ టన్నులకు చేర్చాలని భావిస్తోంది.

భారత్‌ రోజుకు 54 నుంచి 56 లక్షల బ్యారెళ్ల ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది. ఇందులో రష్యా వాటా ఇటీవల 18 నుంచి 20 లక్షల బ్యారెళ్లుగా ఉంది. మొత్తం దిగుమతుల్లో ఇది దాదాపు 35 శాతం. గతంలో ఈ వాటా 50 శాతాన్ని దాటిన సందర్భాలున్నాయి. ధరల ఆధారంగా భారత్‌ కొనుగోళ్ల నిర్ణయాలు తీసుకుంటోందని కథనం పేర్కొంది.

మరోవైపు శుద్ధి చేసిన పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతుల ద్వారా భారత్‌కు భారీ ఆదాయం వస్తోంది. 2026 సెప్టెంబర్‌తో ముగిసిన ఆరు నెలల్లో ఈ ఎగుమతుల విలువ 27.2 బిలియన్‌ డాలర్లకు చేరింది. ఇందులో డీజిల్‌ వాటా 12.6 బిలియన్‌ డాలర్లు. సెప్టెంబర్‌లో రోజుకు సుమారు 6.2 లక్షల బ్యారెళ్ల డీజిల్‌ను భారత్‌ ఎగుమతి చేసింది. ఇందులో దాదాపు సగం ఐరోపా దేశాలకే వెళ్లింది. రష్యా ఉత్పత్తులపై పరిమితులు, ఐరోపాలో రిఫైనరీల మూసివేత, మధ్యప్రాచ్యంలో నిర్వహణ పనుల కారణంగా ఏర్పడిన కొరతను భారత ఎగుమతులు కొంతవరకు భర్తీ చేస్తున్నాయి.

రష్యా చమురు కొనుగోళ్ల విషయంలో భారత్‌పై అమెరికా ఆంక్షలు, సుంకాల ఒత్తిడి తెస్తున్నా.. భారత రిఫైనరీల్లో శుద్ధి చేసిన ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్‌లో ఇంధన సరఫరాకు ఉపయోగపడుతున్నాయని కథనం విశ్లేషించింది. ఇంధన ధరలు పెరిగినప్పుడు అమెరికా కూడా కొన్ని ఆంక్షల విషయంలో మినహాయింపులు ఇచ్చిందని గుర్తుచేసింది. భారత్‌ రిఫైనింగ్‌ సామర్థ్యం పెరిగితే ప్రపంచ మార్కెట్‌లో సరఫరా సమతుల్యతను ప్రభావితం చేసే స్థాయిలో దేశం నిలుస్తుందని పేర్కొంది.
Advertisement

సంబంధిత వార్తలు

IndiaOil Refining CapacityPetroleum ExportsRussian Crude OilGlobal Energy MarketDiesel Exports Europe

More Telugu News

పరిషత్‌ ఎన్నికల్లో ఆసక్తికర ఘటనలు: జగన్‌ మేనత్త ఊరిలో టీడీపీ.. తోడికోడళ్ల పోరులో జనసేన పైచేయి!

07 Nov, 17:48

గుర్నూర్‌ అదుర్స్‌.. అదొక్కటి చేస్తే ఇక అతడికి తిరుగుండదన్న కెప్టెన్‌ గిల్‌

07 Nov, 17:15

కొడంగల్ టెండర్లలో పొంగులేటి కంపెనీకి లబ్ధి: కేటీఆర్

07 Nov, 17:00

ఆకాశమే హద్దుగా.. 13,629 అడుగుల ఎత్తులో భారత వాయుసేన ప్రపంచ రికార్డు

07 Nov, 16:56

బొత్స సత్యనారాయణకు బిగ్ షాక్.. ఓటమి బాటలో కుమార్తె

07 Nov, 16:41

30,273 ఓట్ల మెజార్టీ.. ఏపీలోనే టాప్‌.. పరిషత్‌ ఎన్నికల్లో భారీ మెజార్టీలతో గెలిచిన అభ్యర్థులు వీళ్లే..!

07 Nov, 16:26

రాహుల్‌ వెనుక విదేశీ టూల్‌కిట్‌? బీజేపీ చీఫ్‌ నబీన్‌ సంచలన ఆరోపణలు

07 Nov, 16:12

పల్లె, పట్టణం ఏకమై కూటమికి పట్టం కట్టాయి: ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్

07 Nov, 16:00

కివీస్‌ ఆశలపై వర్షం నీళ్లు.. డీఎల్‌ఎస్‌తో భారత్‌కు సిరీస్‌లో రెండో విజయం!

07 Nov, 15:58

ఎమ్మెల్సీపై డెకాయిటీ కేసులా?: చంద్రబాబు సర్కారుపై జగన్ ఫైర్

07 Nov, 15:51

విశాఖ వేదికగా గ్లోబల్ సమ్మిట్.. ప్రపంచ పెట్టుబడులే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం

07 Nov, 15:44

భారత్‌లో ఏ క్యాన్సర్‌ ఎక్కువో తెలుసా? మహిళలు, పురుషుల్లో టాప్‌-3 ఇవే!

07 Nov, 15:42

కివీస్‌పై చెలరేగిన గుర్నూర్ బ్రార్.. జవగళ్ శ్రీనాథ్ తర్వాత అరుదైన ఘనత

07 Nov, 15:28

'ట్రంప్‌ను ఇకపై నమ్మలేం'.. అమెరికా దాడుల భయంతో ప్ర‌జ‌ల‌కు అయోడిన్ మాత్రలు పంచుతున్న‌ ఇరాన్!

07 Nov, 15:10
..More Telugu News