కివీస్‌పై చెలరేగిన గుర్నూర్ బ్రార్.. జవగళ్ శ్రీనాథ్ తర్వాత అరుదైన ఘనత
Advertisement
- కివీస్‌పై సత్తా చాటిన భారత పేసర్ గుర్నూర్ బ్రార్
- 10 ఓవర్లలో 30 పరుగులిచ్చి 4 వికెట్ల ప్రదర్శన
- న్యూజిలాండ్ గడ్డపై రెండో అత్యుత్తమ బౌలింగ్ గణంకాలు నమోదు
- అగ్రస్థానంలో జవగళ్ శ్రీనాథ్ (4/23) నెలకొల్పిన రికార్డు
- భారత బౌలర్ల ధాటికి 134 పరుగులకే కుప్పకూలిన న్యూజిలాండ్
Advertisement
వెల్లింగ్‌టన్‌లో న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో భారత యువ ఫాస్ట్ బౌలర్ గుర్నూర్ బ్రార్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 10 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 30 పరుగులిచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టాడు. ఫలితంగా కివీస్ జట్టు 134 పరుగులకే కుప్పకూలింది. న్యూజిలాండ్ గడ్డపై ఒక భారత ఫాస్ట్ బౌలర్ నమోదు చేసిన రెండో అత్యుత్తమ గణాంకాలు ఇవి. 2003లో ఆక్లాండ్‌లో జవగళ్ శ్రీనాథ్ (4/23) నెలకొల్పిన రికార్డు అగ్రస్థానంలో ఉంది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆరంభం నుంచే భారత పేసర్లు చెలరేగడంతో న్యూజిలాండ్ 53 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో డారిల్ మిచెల్ (55), కెప్టెన్ మిచెల్ శాంట్నర్ (31) ఆరో వికెట్‌కు 59 పరుగులు జోడించి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే శాంట్నర్‌ను ఔట్ చేసిన గుర్నూర్ బ్రార్ ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు. ఆ తర్వాత కివీస్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది.
గుర్నూర్ బ్రార్ తన స్పెల్‌లో టామ్ లాథమ్, గ్లెన్ ఫిలిప్స్, శాంట్నర్ వంటి కీలక బ్యాటర్లను పెవిలియన్‌కు పంపాడు. అతనికి తోడుగా అక్షర్ పటేల్, ఆఖిబ్ నబీ, అన్షుల్ కంబోజ్ తలో రెండు వికెట్లు తీయడంతో కివీస్ ఇన్నింగ్స్ ముగిసింది. 5 వన్డేల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో నిలిచేందుకు భారత్ ఇప్పుడు 135 పరుగులు చేయాల్సి ఉంది. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు గుర్నూర్ 7 వికెట్లతో లీడింగ్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు.