చీరాల మున్సిపాలిటీలో అనూహ్య ఫలితాలు.. 4 వార్డుల్లో గెలిచిన కాంగ్రెస్

Andhra
Advertisement
  • చీరాల మున్సిపల్ ఎన్నికల్లో ఖాతా తెరిచిన కాంగ్రెస్
  • 1, 21, 25, 33వ వార్డులను కైవసం చేసుకున్న హస్తం పార్టీ
  • మాజీ ఎమ్మెల్యే అమంచి కృష్ణమోహన్ ప్రభావమే కారణమంటున్న విశ్లేషకులు
  • పురపాలికలో ఆధిక్యంలో కొనసాగుతున్న టీడీపీ
  • గెలిచిన అభ్యర్థులకు ఏపీ కాంగ్రెస్ కమిటీ శుభాకాంక్షలు
Advertisement
ఆంధ్రప్రదేశ్ పురపాలక ఎన్నికల ఫలితాల్లో బాపట్ల జిల్లా చీరాల మున్సిపాలిటీ ఫలితాలు ప్రత్యేక ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అధికార టీడీపీ కూటమి హవా కొనసాగినప్పటికీ, చీరాలలో కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా పుంజుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. శుక్రవారం వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ ఏకంగా నాలుగు వార్డులను కైవసం చేసుకుని దశాబ్ద కాలం తర్వాత తన ఉనికిని చాటుకుంది. వాస్తవానికి మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 3న జరిగింది. అయితే మురసు తుపాను ప్రభావంతో చీరాలలో కౌంటింగ్ నవంబరు 6కి వాయిదా పడింది. ఈ నేపథ్యంలో, నేటి ఓట్ల లెక్కింపులో ఆశ్చర్యకర ఫలితాలు వెలువడ్డాయి.

ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం టీడీపీ 12 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ 4, వైఎస్సార్సీపీ 2 వార్డులను గెలుచుకున్నాయి. చీరాలలో కాంగ్రెస్ ఈ స్థాయిలో విజయం సాధించడం వెనుక మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌లో చేరిన ఆమంచి కృష్ణమోహన్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆయన మద్దతుతో బరిలోకి దిగిన అభ్యర్థులు గట్టి పోటీ ఇవ్వడమే కాకుండా, విజయకేతనం ఎగురవేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 1, 21, 25, 33వ వార్డులలో విజయం సాధించారు. ముఖ్యంగా 25వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు.. బీజేపీ, వైసీపీ అభ్యర్థులను వెనక్కి నెట్టడం గమనార్హం. 

రాష్ట్రంలో ఉనికి కోసం పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీకి ఈ ఫలితాలు కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ఈ విజయంపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) హర్షం వ్యక్తం చేసింది. సోషల్ మీడియా వేదికగా విజేతలకు శుభాకాంక్షలు తెలిపింది. "ప్రజలు మీపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, ప్రజాసేవలో ముందుండి, వార్డుల అభివృద్ధికి కృషి చేయాలి" అని ఆకాంక్షించింది. పూర్తిస్థాయి ఫలితాలు ఇంకా వెలువడాల్సి ఉన్నప్పటికీ, చీరాలలో కాంగ్రెస్ ప్రదర్శన రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
Advertisement

సంబంధిత వార్తలు

Chirala MunicipalityCongress PartyAmanchi Krishna MohanAndhra Pradesh Municipal Election ResultsBapatla district politicsTDP vs Congress Chirala

More Telugu News

బీహార్ సీనియర్ జట్టుకు తొలిసారి కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ

06 Nov, 21:32

ఆ చర్చలు ఆపండి.. 'రామాయణ' గురించి సల్మాన్ ఖాన్ కామెంట్స్

06 Nov, 21:26

ఆంధ్రప్రదేశ్‌లో జలకళ.. రిజర్వాయర్లలోకి కొత్త నీరు.. ఎక్కడ ఎంతంటే?

06 Nov, 20:07

తెలంగాణ పోలీసుల ఆరోగ్యం కోసం 'ఫిట్ కాప్'.. త్వరలో అందుబాటులోకి హెల్త్ యాప్

06 Nov, 19:45

రెండో వన్డేకు వర్షం ముప్పు.. మరోసారి యంగ్ పేసర్లపై టీమిండియా ఆశలు

06 Nov, 19:41

కుర్చీలో ఆర్టీసీ డీఎం, నేలపై కార్మికులు.. మంత్రి పొన్నం సీరియస్!

06 Nov, 19:24

బురదలో, పొలం గట్లపై సీఎం చంద్రబాబు.. క్షేత్రస్థాయిలో రైతులకు అండ.. ఫొటోలు ఇవిగో!

06 Nov, 19:13

ఒకటి కాదు రెండు కాదు.. 70కి పైగా అవమానాలు భరించా!: విజయసాయిరెడ్డి

06 Nov, 18:51

మంచి దిగుబడితో పంట చేతికందే సమయంలో మురసు తుపాను దెబ్బతీసింది: రేటూరులో చంద్రబాబు

06 Nov, 18:08

60 టీఎంసీలు ఎత్తిపోయొచ్చు.. ప్రభుత్వం తీసుకుంది 18 టీఎంసీలే: రేవంత్‌ సర్కార్‌పై హరీశ్‌ ఫైర్‌

06 Nov, 17:40

బాలరాజు యాదవ్ అరెస్ట్.. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్

06 Nov, 17:37

ప్రభుత్వ ఒత్తిడితో కథ మార్చారా? ‘మాతృభూమి’పై సల్మాన్‌ ఖాన్‌ క్లారిటీ

06 Nov, 17:32

సెహ్వాగ్‌ తనయుడి విధ్వంసం.. అండర్‌-19 ఆసియా కప్‌లో భారత్‌ శుభారంభం

06 Nov, 17:29

శాంతిపురం కేసులో టీడీపీ ఎమ్మెల్యే అమరనాథ రెడ్డికి భారీ ఊరట.. కేసు కొట్టివేసిన కుప్పం కోర్టు

06 Nov, 17:27
..More Telugu News