ట్రావెల్స్‌ వ్యాపారులకు టయోటా గుడ్‌న్యూస్‌.. ఇన్నోవా క్రిస్టా లిమో వచ్చేసింది!

Business
Advertisement
  • ఇన్నోవా క్రిస్టా లిమోను విడుదల చేసిన టయోటా
  • ప్రారంభ ధర రూ.19.95 లక్షలు.. 2.4 లీటర్ల డీజిల్‌ ఇంజిన్‌
  • ఏడు, ఎనిమిది సీట్ల వెర్షన్లు అందుబాటులోకి
  • మాన్యువల్‌ గేర్‌బాక్స్‌తో కొత్త వేరియంట్‌
Advertisement
ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ భారత మార్కెట్లోకి కొత్త ఇన్నోవా క్రిస్టా లిమో వేరియంట్‌ను తీసుకొచ్చింది. ప్రధానంగా టాక్సీ, ట్రావెల్స్‌ సంస్థలు, ఇతర వాణిజ్య వాహన నిర్వాహకులను లక్ష్యంగా చేసుకుని దీన్ని రూపొందించింది. ఏడు సీట్ల వెర్షన్‌ ధరను రూ.19.95 లక్షలుగా, ఎనిమిది సీట్ల వెర్షన్‌ ధరను రూ.19.99 లక్షలుగా నిర్ణయించింది. ఇవి ఎక్స్‌షోరూమ్‌ ధరలు.

ఇన్నోవా క్రిస్టా లిమోను ప్రత్యేకంగా జీఎక్స్‌-ఎస్‌ఎల్‌ఎఫ్‌ గ్రేడ్‌లో అందిస్తోంది. సాధారణ ఇన్నోవాతో పోలిస్తే ఇంజిన్‌, గేర్‌బాక్స్‌ విషయంలో ఎలాంటి మార్పులు చేయలేదు. ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని కెప్టెన్‌ సీట్లను కూడా అందిస్తోంది. రెండో వరుసలో వ్యక్తిగత సీటింగ్‌కు ప్రాధాన్యమిచ్చే వారు ఏడు సీట్ల వెర్షన్‌ను ఎంచుకోవచ్చు. అదనంగా మరో ప్రయాణికుడికి చోటు కల్పించేలా ఎనిమిది సీట్ల వెర్షన్‌ను రూపొందించింది.

ఈ వాహనంలో 2.4 లీటర్ల నాలుగు సిలిండర్ల డీజిల్‌ ఇంజిన్‌ను అమర్చారు. దీనికి మాన్యువల్‌ గేర్‌బాక్స్‌ను జత చేశారు. సాధారణ ఇన్నోవా క్రిస్టా గరిష్ఠంగా లీటరుకు 15 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని కంపెనీ ధ్రువీకరించింది. సుదూర ప్రయాణాలు, తరచూ ప్రయాణికులను తీసుకెళ్లే వాణిజ్య అవసరాలకు ఇది అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు.

కొనుగోలుదారులకు మూడేళ్లు లేదా లక్ష కిలోమీటర్ల వరకు ప్రామాణిక వారంటీ లభిస్తుంది. అదనపు మొత్తంతో ఐదేళ్లు లేదా 2.20 లక్షల కిలోమీటర్ల వరకు వారంటీని పొడిగించుకోవచ్చు. ఏడేళ్ల వరకు ఫైనాన్స్‌ సదుపాయాలు, తక్కువ ఈఎంఐ పథకాలు, త్వరిత సర్వీసింగ్‌, 24 గంటల రోడ్‌సైడ్‌ అసిస్టెన్స్‌ సదుపాయాలను కూడా టయోటా అందిస్తోంది.
Advertisement

సంబంధిత వార్తలు

ToyotaToyota Innova Crysta LimoInnova Crysta Limo PriceToyota Kirloskar MotorInnova Crysta Commercial VariantNew Toyota Innova Launch India

More Telugu News

శ్రీరాముడి వనవాసం 14 ఏళ్లే.. నాకు మాత్రం ఇంకా ముగియలేదు: రేణూ దేశాయ్

06 Nov, 12:48

వన్ మినిట్ వీడియోలతో విష ప్రచారం చేస్తున్నారు: బీద రవిచంద్ర

06 Nov, 12:33

బంగారం Vs వెండి Vs గోల్డ్‌ ఈటీఎఫ్‌లు.. ధనత్రయోదశి వేళ ఏది కొనాలి?

06 Nov, 12:30

హైదరాబాద్‌కు రసాయనాలతో తయారు చేసిన కల్తీ పాల సరఫరా.. రంగారెడ్డి జిల్లాలో గుట్టురట్టు!

06 Nov, 12:27

రాముడు, రావణుడి అసలైన వైభవాన్ని, శక్తిని చూడాలంటే తప్పకుండా 'రామాయణ' చూడాలి: సందీప్ వంగా

06 Nov, 12:06

వాట్సాప్‌లో ఇక బ్లూ టిక్స్‌ భయం లేదు.. చాట్‌ ఓపెన్‌ చేయకుండానే మెసేజ్‌లు చదవొచ్చు!

06 Nov, 12:04

పీవీఆర్‌లో మెటా గ్లాసెస్ రగడ.. సిబ్బందితో వ్యక్తి వాదన.. వైరల్ అయిన వీడియో!

06 Nov, 12:02

కృష్ణుడిపై వివాదాస్పద వ్యాఖ్యలు.. ధీరేంద్ర శాస్త్రిపై ఆగ్రాలో క్రిమినల్ కేసు

06 Nov, 11:54

భారత్‌-న్యూజిలాండ్‌ రెండో వన్డే.. వరుణుడే ఆడేస్తాడా? వాతావరణంపై ఉత్కంఠ!

06 Nov, 11:45

'సమ్మర్‌ హాలిడేస్‌' మూవీ రివ్యూ

06 Nov, 11:44

టీమిండియాలోకి రీఎంట్రీపై మనసులో మాట చెప్పిన పృథ్వీ షా

06 Nov, 11:32

లాస్ ఏంజిల్స్ మేయర్‌గా భారత సంతతి మహిళ.. మన వ్యవస్థపై శశి థరూర్ వ్యాఖ్యలు

06 Nov, 11:20

కడుపులోకి వెళ్లిన టూత్ బ్రష్.. సర్జరీ లేకుండా బయటకు తీసిన వైద్యులు!

06 Nov, 11:17

కుటుంబంలోని ఏడుగురి హత్య .. భార్యపై కక్షతో రాక్షసుడిగా మారిన క్యాబ్ డ్రైవర్‌

06 Nov, 11:15
..More Telugu News