ఉద్రిక్తతల మధ్య భారత్‌కు గుడ్ న్యూస్ చెప్పిన ఇరాన్

International
Advertisement
  • హర్మూజ్ జలసంధిలో భారత నౌకల రాకపోకలకు ఇరాన్ అనుమతి
  • భారత్, చైనా, ఇరాక్, ఖతార్ నౌకలకు ఎలాంటి ఆంక్షలు ఉండవని ప్రకటన
  • ఔషధాల దిగుమతికి వీలుగా భారత్‌కు ఈ వెసులుబాటు కల్పించినట్లు వెల్లడి
  • భారత్, చైనాలు ట్రాన్సిట్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం
  • ఖతార్ నౌకలకు మాత్రం ఎలాంటి రుసుము లేదని వెల్లడి
Advertisement
హర్మూజ్ జలసంధిలో మరోసారి ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఇరాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ జలమార్గం గుండా ప్రయాణించే భారత వాణిజ్య నౌకలకు ప్రత్యేక అనుమతులు మంజూరు చేసింది. ఇరాన్ పార్లమెంటుకు చెందిన జాతీయ భద్రత, విదేశాంగ విధాన కమిటీ వైస్ ఛైర్మన్ హయత్ మొఘద్దమ్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

భారత్‌తో పాటు చైనా, ఇరాక్, ఖతార్ దేశాల వాణిజ్య నౌకల రాకపోకలపై హర్మూజ్ జలసంధిలో ఎలాంటి ఆంక్షలు ఉండవని హయత్ మొఘద్దమ్ స్పష్టం చేశారు. ఈ దేశాల నౌకలు యథేచ్ఛగా ప్రయాణించవచ్చని, అమెరికా సైతం వీటిని అడ్డుకోకపోవచ్చని ఆయన పేర్కొన్నారు.

అంతర్జాతీయ నివేదికల ప్రకారం.. చైనాకు రాజకీయ కారణాలతో, భారత్‌కు ప్రధానంగా ఔషధాల దిగుమతిని సులభతరం చేసేందుకు ఈ వెసులుబాటు కల్పించినట్లు తెలుస్తోంది. అయితే, భారత్, చైనా దేశాల నౌకలు ఈ మార్గంలో ప్రయాణించేందుకు నిర్దేశిత ట్రాన్సిట్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

మరోవైపు, ఖతార్ నౌకలకు మాత్రం ఎటువంటి రుసుము లేకుండానే అనుమతి కల్పించడం గమనార్హం. ప్రపంచ వాణిజ్యం, చమురు రవాణాలో అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిలో చోటుచేసుకున్న ఈ పరిణామం ప్రస్తుతం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
Advertisement

సంబంధిత వార్తలు

IranStrait of HormuzIndian commercial shipsIndia Iran tradeHayat MoghaddamMaritime transit fees

More Telugu News

బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి హౌస్ అరెస్ట్.. శబరిని ఎందుకు వదిలేశారంటూ వైసీపీ ప్రశ్న

05 Nov, 12:01

చాహల్‌పై ఆర్‌జే మహ్వష్ ఆరోపణలు చేశారా?.. వైరల్ క్లిప్‌లోని అసలు నిజమిదే!

05 Nov, 11:58

విమానం బాత్రూంలో ఇమడలేకపోయిన పొడగరి.. కానీ నెటిజన్లు ఫోకస్ వేరే!

05 Nov, 11:50

భారతదేశంలోనే ‘మినీ ఇజ్రాయెల్‌’.. హిమాలయాల్లో దాగున్న ఈ గ్రామం ప్రత్యేకతలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!

05 Nov, 11:45

పులివెందుల ఎర్రిపల్లెలో పెట్రోల్ బాంబులతో దాడులు.. తీవ్ర ఉద్రిక్తత

05 Nov, 11:42

అంతర్జాతీయ పరిణామాలతో దూసుకెళ్లిన పసిడి.. ఒక్కరోజే రూ.5,000 పెరిగిన బంగారం

05 Nov, 11:41

ప్రవళిక మృతితో ఆర్టీసీ కీలక నిర్ణయం.. డోర్లు మూస్తేనే బస్సు ముందుకు!

05 Nov, 11:24

రామాయణం చివర్లో సన్నీ డియోల్ ఎంట్రీ... హనుమంతుడిగా అదుర్స్

05 Nov, 11:23

కూటమి బలాన్ని తట్టుకుని పోరాడాం: జీవీఎంసీ ఓటమిపై వరుదు కల్యాణి

05 Nov, 11:21

ఖాళీ గదిలో మాట్లాడితే శబ్దం ఎందుకు ఎక్కువగా వస్తుంది?.. సైన్స్ ఏం చెబుతోంది?

05 Nov, 11:20

వైభవ్‌ సూర్యవంశీకి వైస్‌ కెప్టెన్సీ.. సచిన్‌ ఏమన్నారంటే..!

05 Nov, 11:18

దలాల్ స్ట్రీట్‌కు దీపావళి కానుక.. అమెరికా ఫలితాలతో రూ. 7 లక్షల కోట్ల సంపద!

05 Nov, 11:16

94 శాతం స్ట్రైక్‌రేట్‌ను దాటాలి.. పరిషత్ ఎన్నికలకు సీఎం చంద్రబాబు కొత్త టార్గెట్

05 Nov, 11:15

మున్సిపల్ ఎన్నికల ఫలితాలే పరిషత్ ఎన్నికల్లోనూ రిపీట్ అవుతాయి: మంత్రి బాల వీరాంజనేయస్వామి

05 Nov, 11:14

అమెరికాతో డీల్‌పై భారత్‌ ఆచితూచి అడుగులు.. కలిసిరానున్న ఎన్నికల ఫలితాలు!

05 Nov, 11:09
..More Telugu News