పార్నపల్లిలో వైఎస్ అవినాశ్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు.. తీవ్ర వాగ్వాదం
Advertisement
- పరిషత్ ఎన్నికల పోలింగ్‌లో కడప జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత
- పార్నపల్లిలో పోలింగ్ కేంద్రానికి వెళుతుండగా అవినాశ్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు
- జిల్లాలోకి పెద్ద సంఖ్యలో బయట వ్యక్తులు చొరబడ్డారన్న అవినాశ్
Advertisement
పరిషత్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా కడప జిల్లాలో పలుచోట్ల తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పులివెందుల నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాల్లో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. దీంతో పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు.
పులివెందుల సమీపంలోని పార్నపల్లిలో కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తన అనుచరులతో కలిసి పోలింగ్ కేంద్రానికి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, ఎంపీకి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా అవినాశ్ రెడ్డి మాట్లాడుతూ... పెద్ద సంఖ్యలో బయటి వ్యక్తులు జిల్లాలోకి చొరబడ్డారని... రాళ్లు, కర్రలతో తిరుగుతూ వైసీపీ ఏజెంట్లను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. పోలీసుల సమక్షంలోనే ఇదంతా జరుగుతోందని, తమ పార్టీ నేతలను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోవైపు, ఆర్ తుమ్మలపల్లిలో టీడీపీ, వైసీపీ వర్గీయులు రాళ్లు, సోడా బాటిళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. పెద్దముడియం మండలం గుండ్లకుంటలో రెండు పోలింగ్ కేంద్రాల నుంచి టీడీపీ ఏజెంట్లను వైసీపీ నేతలు బయటకు పంపించగా, పోలీసులు కల్పించుకుని వారిని తిరిగి లోపలికి పంపించారు. ఈ వరుస ఘటనల నేపథ్యంలో ఉద్రిక్త ప్రాంతాల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.