జీవీఎంసీ ఎన్నికల్లో ఆసక్తికరం.. రెబల్‌గా గెలిచిన టీమిండియా క్రికెటర్ నితీశ్ రెడ్డి పెదనాన్న
Advertisement
- టీడీపీ టికెట్ దక్కకపోవడంతో రెబల్‌గా గెలిచిన క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి పెదనాన్న
- గాజువాక 86వ వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా కాకి గోవిందరెడ్డి గెలుపు
- విశాఖ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్న టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి
- 2.44 లక్షల ఓట్ల భారీ మెజార్టీతో మేయర్‌గా ముక్కా శ్రావణి విజయం
- మొత్తం 120 వార్డుల్లో కూటమి 98 స్థానాల్లో జయకేతనం
Advertisement
మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభంజనం సృష్టించింది. మేయర్ పీఠాన్ని కూటమి కైవసం చేసుకుంది. కూటమి తరఫున మేయర్ అభ్యర్థిగా బరిలోకి దిగిన ముక్కా శ్రావణి ఏకంగా 2.44 లక్షల ఓట్ల భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. మొత్తం 120 వార్డులకు గాను టీడీపీ 64, జనసేన 26, బీజేపీ 8 డివిజన్లలో గెలుపొందాయి. దీంతో కూటమి బలం 98కి చేరింది. వైసీపీ కేవలం 13 స్థానాలకే పరిమితమైంది. సీపీఎం ఒక స్థానంలో, స్వతంత్రులు 8 వార్డుల్లో విజయం సాధించారు.
ఈ ఎన్నికల ఫలితాల్లో ఓ ఆసక్తికరమైన అంశం చోటుచేసుకుంది. టీమిండియా యువ క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి పెదనాన్న కాకి గోవిందరెడ్డి, రెబల్ అభ్యర్థిగా పోటీ చేసి కార్పొరేటర్‌గా గెలుపొందారు. గాజువాక నియోజకవర్గం పరిధిలోని 86వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన, 200 ఓట్లకు పైగా మెజార్టీతో విజయం సాధించారు. నితీశ్ కుమార్ రెడ్డి తండ్రి ముత్యాల రెడ్డి, కాకి గోవిందరెడ్డి అన్నదమ్ములు.
సుమారు 35 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న కాకి గోవిందరెడ్డి, టీడీపీలో సీనియర్ నేతగా గుర్తింపు పొందారు. గతంలో పార్టీలో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా, అధికార ప్రతినిధిగా, ఎంబీసీ కార్పొరేషన్ ఛైర్మన్‌గా పలు కీలక పదవులు నిర్వహించారు. ఈసారి ఎన్నికల్లో 86వ వార్డు నుంచి టీడీపీ టికెట్ ఆశించగా, ఆయనకు నిరాశే ఎదురైంది. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఆయన, పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు.
అభిమానుల ఒత్తిడి మేరకు తన భార్య శ్రీదేవిని 85వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దింపారు. అయితే, ఆమె ఓటమి చెందగా, గోవిందరెడ్డి మాత్రం గెలిచి తన పట్టు నిరూపించుకున్నారు. 2021లో జరిగిన ఎన్నికల్లోనూ ఆయన టీడీపీ తరఫున కార్పొరేటర్‌గా గెలుపొందారు. ఇప్పుడు పార్టీ టికెట్ ఇవ్వకపోయినా, స్వతంత్రంగా గెలవడం ఆయన రాజకీయ పలుకుబడికి నిదర్శనంగా నిలిచింది.