పోలవరం-బనకచర్ల లింక్‌పై రేవంత్ సర్కార్ ద్వంద్వ వైఖరి: కవిత

Both States
Advertisement
  • చంద్రబాబుకు రేవంత్ రెడ్డి గురుదక్షిణ ఇస్తున్నారన్న కవిత
  • నదీ జలాల వినియోగంపై ప్రభుత్వానికి స్పష్టమైన విధానం లేదని విమర్శ
  • పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుతో తెలంగాణకు జరిగే నష్టాన్ని గుర్తించాలని సూచన
Advertisement
పోలవరం - బనకచర్ల లింక్ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నదీ జలాల వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైన విధానం లేదని, ఈ విషయం ఎన్‌డబ్ల్యూడీఏ సమావేశాలతో మరోసారి బహిర్గతమైందని ఆమె విమర్శించారు.

ఎన్‌డబ్ల్యూడీఏ సమావేశాల్లో రాష్ట్ర అధికారులు గోదావరి - కావేరి నదుల అనుసంధానాన్ని సమ్మక్క సాగర్ నుంచి చేపట్టాలని కోరుతుంటే... మరోవైపు కేంద్ర హోంమంత్రి అధ్యక్షతన జరిగిన దక్షిణాది రాష్ట్రాల కౌన్సిల్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పోలవరం - బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు సమ్మతి తెలపడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని కవిత ఆరోపించారు.

ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణ నీటి హక్కులకు తీవ్ర విఘాతం కలుగుతుందని, 2024లోనే తెలంగాణ జాగృతి తరఫున తాము దీనిని వ్యతిరేకించామని గుర్తుచేశారు. "రాష్ట్రానికి హక్కుగా దక్కాల్సిన 250 టీఎంసీల గోదావరి జలాలను సీఎం రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబుకు ‘గురుదక్షిణ’గా చెల్లించుకుంటున్నారు" అని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆమోదంతోనే ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు విషయంలో ముందుకెళ్లేందుకు కేంద్రంపై ఒత్తిడి తెస్తోందని విమర్శించారు.

ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుతో తెలంగాణకు జరిగే నష్టాన్ని గుర్తించాలని కవిత హెచ్చరించారు. ఈ ప్రాజెక్టుపై కేంద్రం జరిపే అన్ని సంప్రదింపుల నుంచి తెలంగాణ తక్షణమే వైదొలగాలని, ప్రాజెక్టును అడ్డుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం వెంటనే లేఖ రాయాలని ఆమె డిమాండ్ చేశారు.
Advertisement

సంబంధిత వార్తలు

Kalvakuntla KavithaRevanth ReddyPolavaram Banakacherla LinkTelangana Water RightsGodavari Cauvery River LinkingChandrababu Naidu

More Telugu News

ఈడీ విచారణకు హాజరైన అంబటి రాంబాబు

04 Nov, 12:22

అమెరికాలో ట్రంప్‌కు గట్టి షాక్.. కాంగ్రెస్‌పై డెమొక్రాట్ల పట్టు.. భారత్‌పై ప్రభావమెంత?

04 Nov, 12:21

రేపే ఏపీ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు.. రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్

04 Nov, 12:04

హిందూ-యూదుల బంధంతో ముస్లింలకు ముప్పట.. భారత్‌-ఇజ్రాయెల్‌ దోస్తీపై పాక్‌ అక్కసు!

04 Nov, 12:03

హ్యాపీనెస్ ఆల్వేస్.. టబుకు జాకీ ష్రాఫ్ స్పెషల్ బర్త్ డే విషెస్!

04 Nov, 12:00

వివేక్ రామస్వామికి వివాదాస్పద యాడ్ దెబ్బ.. ప్రత్యర్థిపై వ్యక్తిగత దాడి బెడిసికొట్టింది!

04 Nov, 11:57

ఫీల్డింగ్‌లో రో-కో మెరుపులు.. కోహ్లీ కళ్లు చెదిరే క్యాచ్‌.. రోహిత్‌ అదిరిపోయే రనౌట్‌!

04 Nov, 11:41

భారత పేసర్ల ధాటికి కివీస్ విలవిల.. తొలి వన్డేలో 185 పరుగులకే ఆలౌట్

04 Nov, 11:29

దీపావళి గిఫ్ట్‌గా ఉద్యోగులకు ఐఫోన్ 16.. ఢిల్లీ కంపెనీపై ప్రశంసల వర్షం!

04 Nov, 11:20

గాయకుడిగా సల్మాన్.. 'తేరి సెక్సీ బ్యూటీ' సాంగ్ రిలీజ్

04 Nov, 11:19

ఏపీలో రేపే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు... పోలింగ్ జరుగుతుందా?

04 Nov, 11:13

ఇరాన్‌పై అణుదాడి జరిగితే భారత్‌కూ ముప్పు తప్పదా? రేడియేషన్‌ ఎక్కడి వరకు వస్తుంది?

04 Nov, 11:12

ఏపీపీఎస్సీ గ్రూప్-1 స్కామ్.. ఏపీ, తెలంగాణలో ఈడీ మెరుపుదాడులు

04 Nov, 11:09

రైలు వెళ్లిన కాసేపటికే పట్టాలపై పేలుడు.. అదీ భారత్‌-పాక్‌ సరిహద్దుకు కొంత దూరంలో..!

04 Nov, 11:08
..More Telugu News