దీపావళి గిఫ్ట్‌గా ఉద్యోగులకు ఐఫోన్ 16.. ఢిల్లీ కంపెనీపై ప్రశంసల వర్షం!

Offbeat
Advertisement
  • రోహిణి ప్రాంతంలో ఉన్న సంస్థ
  • ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారిన వీడియో
  • డెస్క్‌లపై రిబ్బన్లతో అలంకరించిన ఫోన్లు
  • బహుమతులు చూసి ఆనందించిన ఉద్యోగులు
  • కంపెనీపై ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు
Advertisement
దీపావళి పండగకు ఉద్యోగులకు స్వీట్లు, గిఫ్ట్‌ హ్యాంపర్లు ఇవ్వడం సాధారణం. అయితే ఢిల్లీలోని ఓ కంపెనీ మాత్రం తన ఉద్యోగులకు ఏకంగా ఐఫోన్ 16 ఫోన్లను బహుమతిగా ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

న్యూఢిల్లీలోని రోహిణి ప్రాంతానికి చెందిన ఓ కంపెనీ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేసింది. 15 సెకన్ల నిడివి ఉన్న ఈ క్లిప్‌లో ఉద్యోగుల డెస్క్‌లపై రిబ్బన్లతో అలంకరించిన ఐఫోన్ 16 ఫోన్లు కనిపిస్తున్నాయి. తెలుపు, ఆకుపచ్చ, నీలం, నలుపు రంగుల్లో ఉన్న ఫోన్లను కంప్యూటర్ల ముందు ఉంచారు. బహుమతులు చూసిన పలువురు మహిళా ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేయడం వీడియోలో కనిపించింది.

ఈ వీడియోను షేర్ చేస్తూ కంపెనీ ‘నో కాంపిటీషన్.. మీకు ఏం వచ్చింది?’ అనే క్యాప్షన్ ఇచ్చింది. దీంతో నెటిజన్లు పెద్ద సంఖ్యలో స్పందిస్తున్నారు. కంపెనీ ఇచ్చిన బహుమతిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తమకూ ఇలాంటి ఉద్యోగం కావాలంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు ఈ వీడియో నిజమైనదేనా? ఏఐతో రూపొందించారా? అంటూ సందేహాలు వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన కంపెనీ.. వీడియో ఏఐతో రూపొందించింది కాదని స్పష్టం చేసింది.

మహిళా ఉద్యోగులకు ఐఫోన్లు ఇస్తే, పురుష ఉద్యోగులకు బంగారు నాణేలు ఇచ్చారంటూ ఓ నెటిజన్ సరదాగా వ్యాఖ్యానించారు. తమ కంపెనీలో కనీసం స్వీట్ల బాక్స్ కూడా ఇవ్వలేదని మరొకరు వాపోయారు. మొత్తానికి ఉద్యోగులకు కంపెనీ ఇచ్చిన దీపావళి కానుక ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
Advertisement

సంబంధిత వార్తలు

Delhi CompanyiPhone 16Diwali GiftEmployee RewardsViral VideoNew Delhi Rohini

More Telugu News

రేపే ఏపీ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు.. రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్

04 Nov, 12:04

హిందూ-యూదుల బంధంతో ముస్లింలకు ముప్పట.. భారత్‌-ఇజ్రాయెల్‌ దోస్తీపై పాక్‌ అక్కసు!

04 Nov, 12:03

హ్యాపీనెస్ ఆల్వేస్.. టబుకు జాకీ ష్రాఫ్ స్పెషల్ బర్త్ డే విషెస్!

04 Nov, 12:00

వివేక్ రామస్వామికి వివాదాస్పద యాడ్ దెబ్బ.. ప్రత్యర్థిపై వ్యక్తిగత దాడి బెడిసికొట్టింది!

04 Nov, 11:57

ఫీల్డింగ్‌లో రో-కో మెరుపులు.. కోహ్లీ కళ్లు చెదిరే క్యాచ్‌.. రోహిత్‌ అదిరిపోయే రనౌట్‌!

04 Nov, 11:41

భారత పేసర్ల ధాటికి కివీస్ విలవిల.. తొలి వన్డేలో 185 పరుగులకే ఆలౌట్

04 Nov, 11:29

పోలవరం-బనకచర్ల లింక్‌పై రేవంత్ సర్కార్ ద్వంద్వ వైఖరి: కవిత

04 Nov, 11:21

గాయకుడిగా సల్మాన్.. 'తేరి సెక్సీ బ్యూటీ' సాంగ్ రిలీజ్

04 Nov, 11:19

ఏపీలో రేపే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు... పోలింగ్ జరుగుతుందా?

04 Nov, 11:13

ఇరాన్‌పై అణుదాడి జరిగితే భారత్‌కూ ముప్పు తప్పదా? రేడియేషన్‌ ఎక్కడి వరకు వస్తుంది?

04 Nov, 11:12

ఏపీపీఎస్సీ గ్రూప్-1 స్కామ్.. ఏపీ, తెలంగాణలో ఈడీ మెరుపుదాడులు

04 Nov, 11:09

రైలు వెళ్లిన కాసేపటికే పట్టాలపై పేలుడు.. అదీ భారత్‌-పాక్‌ సరిహద్దుకు కొంత దూరంలో..!

04 Nov, 11:08

ధన త్రయోదశి షాక్.. గతేడాదితో పోలిస్తే భారీగా పెరిగిన బంగారం ధరలు!

04 Nov, 10:57

మహిళా కండక్టర్ ప్రవళిక మృతి.. బాధ్యులపై కఠిన చర్యలు తప్పవన్న మంత్రి పొన్నం

04 Nov, 10:54
..More Telugu News