రష్మిక హిందీ యాసపై విమర్శలు.. అండగా నిలిచిన బాలీవుడ్ నటి
Advertisement
- హిందీలో దక్షిణాది నటుల యాసపై ట్రోలింగ్ సరికాదన్న కషికా కపూర్
- నటులను నటన ఆధారంగా చూడాలి, భాష అడ్డంకి కాకూడదని వ్యాఖ్య
- రష్మిక మందన్న లాంటి నటిని యాస పేరుతో విమర్శించడం తగదని హితవు
- పనితీరుకే విలువివ్వాలి కానీ యాసతో జడ్జ్ చేయకూడదని స్పష్టం
Advertisement
బాలీవుడ్‌లో పనిచేసే దక్షిణాది నటీనటులు వారి హిందీ యాస (యాక్సెంట్) కారణంగా తరచుగా విమర్శలు, ట్రోలింగ్ ఎదుర్కోవడంపై యువ నటి కషికా కపూర్ స్పందించారు. నటులను వారి నటన ఆధారంగా చూడాలని, భాష లేదా యాస ఎప్పటికీ అడ్డంకి కాకూడదని ఆమె అభిప్రాయపడ్డారు. ఐఏఎన్ఎస్ వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
"హిందీ చిత్రాల్లో పనిచేసే దక్షిణాది నటుల యాసపై విమర్శలు వస్తుంటాయి, దీనిపై మీ అభిప్రాయం ఏమిటి?" అని అడగగా, కషికా బదులిస్తూ.. "ఇలా జరగడం చూస్తూనే ఉన్నాం. కానీ ఒక నటుడిని/నటిని అంతిమంగా నటన ఆధారంగానే గుర్తించాలి. భాష అనేది ఎప్పటికీ అవరోధం కాకూడదు. ఇది తెలుగు చిత్ర పరిశ్రమ, ఇది హిందీ చిత్ర పరిశ్రమ అని మనం విడదీయకూడదు" అని స్పష్టం చేశారు.
గతంలో 'కాఫీ విత్ కరణ్' షోలో నటి రష్మిక మందన్న కూడా తన కెరీర్‌లో యాస విషయంలో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నానని వెల్లడించిన సంగతి తెలిసిందే. దక్షిణాదికి చెందిన దానిని కావడం వల్ల తన హిందీ యాస సహజంగానే అలా వస్తుందని, అయినా ఆ విమర్శలకు భయపడి తాను వేర్వేరు భాషల్లో పనిచేయడం ఆపనని ఆమె తెలిపారు.
ఈ నేపథ్యంలో రష్మిక ఉదాహరణను ప్రస్తావిస్తూ కషికా మాట్లాడారు. "ఉదాహరణకు రష్మిక మందన్నను తీసుకోండి. ఆమె ఒక అద్భుతమైన నటి, పెర్ఫార్మర్. ఆమెను యాస లేదా భాష ఆధారంగా జడ్జ్ చేయడం సరైంది కాదు. అది ఆమె గుర్తింపులో ఒక భాగం. ఆమె మూలాలు అక్కడివి. 'యానిమల్' లాంటి భారీ చిత్రాల్లో నటించి గొప్ప పనితీరు కనబరిచారు. నటులను వారి యాసను బట్టి కాకుండా, వారి ప్రతిభను చూసి అభినందించాలి" అని కషికా కపూర్ తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు.