ఐపీఎల్ ఫ్రాంచైజీలకు ఊరట.. రిటెన్షన్ గడువు నవంబర్ 17కి మార్పు
Advertisement
- నవంబర్ 15 నుంచి 17కి మార్చిన బీసీసీఐ
- భారత్-న్యూజిలాండ్ వన్డే కారణంగా నిర్ణయం
- గోవాలో డిసెంబర్ 16న మినీ వేలం యథాతథం
- ఇప్పటికే ఢిల్లీకి పంత్, హైదరాబాద్‌కు నటరాజన్ బదిలీ
Advertisement
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2027 సీజన్‌కు సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక ప్రకటన చేసింది. ఆటగాళ్ల రిటెన్షన్ ప్రక్రియకు సంబంధించి ఫ్రాంచైజీలకు విధించిన గడువును మరో రెండు రోజుల పాటు పొడిగించింది. ఈ మేరకు తీసుకున్న నిర్ణయాన్ని సోమవారం పది ఫ్రాంచైజీలకు అధికారికంగా వెల్లడించింది.
తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం, రిటెన్షన్ గడువు నవంబర్ 15తో ముగియాల్సి ఉంది. అయితే, అదే రోజున భారత్ - న్యూజిలాండ్ జట్ల మధ్య ఐదో వన్డే మ్యాచ్ ఉండటంతో ఈ గడువును నవంబర్ 17 వరకు పొడిగించారు. అంతర్జాతీయ మ్యాచ్ జరిగే సమయంలో రిటెన్షన్ ప్రకటన వెలువడితే, దానికి మీడియాలో తగినంత ప్రాధాన్యం లభించదనే ఉద్దేశంతో బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.
మరోవైపు, ఐపీఎల్ 2027 మినీ వేలానికి సంబంధించిన పూర్తి షెడ్యూల్ కూడా ఖరారైంది. ఆటగాళ్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ నవంబర్ 23 వరకు కొనసాగనుండగా, డిసెంబర్ 16న గోవా వేదికగా మినీ వేలం నిర్వహించనున్నారు. అదే రోజున భారత్ - శ్రీలంక జట్ల మధ్య వన్డే మ్యాచ్ ఉన్నప్పటికీ, వేలం తేదీలో ఎలాంటి మార్పు ఉండబోదని బీసీసీఐ స్పష్టం చేసింది.
ప్రస్తుత సైకిల్‌లో ఇదే చివరి మినీ వేలం కాగా, 2028 సీజన్‌కు ముందు మెగా వేలం జరగనుంది. ఇదిలా ఉండగా, వేలానికి ముందే ఫ్రాంచైజీల మధ్య రెండు కీలక ట్రేడింగ్‌లు జరిగాయి. లక్నో నుంచి రిషభ్ పంత్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ తిరిగి తీసుకోగా, నటరాజన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు బదిలీ చేసింది.