యువ సంచలనాన్ని నిరుత్సాహపరుస్తున్నారు: టీమిండియాపై శ్రీకాంత్ అసంతృప్తి
Advertisement
- వైభవ్ సూర్యవంశీ విషయంలో గంభీర్‌పై కృష్ణమాచారి శ్రీకాంత్ ఆగ్రహం
- వరుస అవకాశాలు ఇవ్వకుండా బెంచ్‌పై కూర్చోబెట్టడం సరికాదని వ్యాఖ్య
- ఐర్లాండ్, వెస్టిండీస్ సిరీస్‌లలో అవకాశం ఇచ్చి ఉండాల్సిందని వ్యాఖ్య
Advertisement
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి అవకాశాలు కల్పించకపోవడంపై భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని టీమ్ మేనేజ్‌మెంట్ వైఖరిని తప్పుబట్టాడు. న్యూజిలాండ్‌తో జరిగిన చివరి టీ20లో వైభవ్‌ను పక్కన పెట్టడాన్ని ప్రశ్నిస్తూ, యాజమాన్యంపై విమర్శలు గుప్పించాడు.
"వైభవ్ సూర్యవంశీకి వరుసగా అవకాశాలు ఇవ్వండి. ముగ్గురు ఓపెనర్లకు ఓ స్పష్టత ఇవ్వండి. మీలో ఒకరు మూడు మ్యాచ్‌లు ఆడతారు, మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో మరొకరికి అవకాశం ఇస్తామని చెప్పండి. అలా కాకుండా వైభవ్‌ను బెంచ్‌పై కూర్చోబెట్టడం సరికాదు. ఐర్లాండ్‌తో జరిగిన ఆ రెండు మ్యాచ్‌ల్లోనే ఆడించాల్సింది. అక్కడే తప్పు చేశారు. ఆ తర్వాత భారత్‌కు వచ్చిన వెస్టిండీస్ జట్టుపై కూడా వైభవ్‌కు అవకాశం ఇవ్వలేదు. ఆ బౌలింగ్ దళంపై ఈ వయసులో నేను కూడా పరుగులు చేయగలను" అని ఘాటుగా వ్యాఖ్యానించాడు.
యువ ఆటగాళ్లను ప్రోత్సహించాల్సింది పోయి నిరుత్సాహపరుస్తున్నారని శ్రీకాంత్ ఆవేదన వ్యక్తం చేశాడు. "ఆ కుర్రాడికి అవకాశం ఇచ్చి తీర్చిదిద్దండి. వెస్టిండీస్ సిరీస్‌లో వైభవ్‌కు ఎందుకు అవకాశం ఇవ్వలేదో చెప్పాలి. వైభవ్ సూర్యవంశీ అన్ని ఫార్మాట్లలో ఆడగలడు. అతడికి వన్డే జట్టులోనూ చోటు ఇవ్వాలి. ఆ కుర్రాడిలో అపారమైన ప్రతిభ ఉంది" అని వివరించాడు. అభిషేక్ శర్మ, వైభవ్ ఓపెనింగ్ చేసి ఉంటే ప్రత్యర్థి జట్టుకు బౌలింగ్ వ్యూహాలు రచించడం కష్టమయ్యేదని అభిప్రాయపడ్డాడు.