48 ప్రభుత్వ స్కూళ్లను దత్తత తీసుకున్న మంచు లక్ష్మి

Entertainment
Advertisement
  • ఉమ్మడి మెదక్ జిల్లాలో 48 ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకున్న మంచు లక్ష్మి
  • గ్రామీణ విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందించడమే లక్ష్యమని వెల్లడి
  • సంగారెడ్డి జిల్లా చౌటకూర్ స్కూల్‌లో డిజిటల్ క్లాస్‌రూమ్‌ ప్రారంభం
Advertisement
ప్రముఖ సినీ నటి, సామాజిక కార్యకర్త మంచు లక్ష్మి ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి నడుం బిగించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కూడా కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలనే లక్ష్యంతో ముందుకెళుతున్నట్టు ఆమె తెలిపారు. తన 'టీచ్ ఫర్ చేంజ్' స్వచ్ఛంద సంస్థ ద్వారా ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని 48 ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకున్నట్లు ప్రకటించారు.

ఈరోజు సంగారెడ్డి జిల్లాలో పర్యటించిన మంచు లక్ష్మి... చౌటకూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ 'టీచ్ ఫర్ చేంజ్' ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన డిజిటల్ స్మార్ట్ క్లాస్‌రూమ్‌ను ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన లక్ష్మి... గ్రామీణ విద్యార్థుల కోసం అత్యాధునిక సాంకేతికతను అందుబాటులోకి తెస్తున్నట్లు చెప్పారు.

దత్తత తీసుకున్న పాఠశాలల్లో స్మార్ట్ ఎల్‌ఈడీ టీవీలు, డిజిటల్ క్లాస్‌రూమ్‌లు, ఇతర మౌలిక వసతులను కల్పిస్తున్నట్లు ఆమె వివరించారు. నాణ్యమైన విద్య ద్వారానే విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని, అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంచేందుకు తనవంతు కృషి చేస్తున్నానని పేర్కొన్నారు.
Advertisement

సంబంధిత వార్తలు

Manchu LakshmiTeach for ChangeMedak government schoolsDigital smart classroomsRural education developmentSangareddy school adoption

More Telugu News

మురసు తుపాను ఎఫెక్ట్: ఏపీలో పలు జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు

02 Nov, 16:45

రిలయన్స్‌ దూకుడుతో మార్కెట్ల పరుగులు.. 1,233 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌

02 Nov, 16:39

అసలు వీటిని ఎన్నికలంటారా?: రవీంద్రనాథ్ రెడ్డి

02 Nov, 16:35

దిగ్గజ జట్లకు షాక్.. వన్డే ర్యాంకింగ్స్‌లో ఆఫ్ఘ‌నిస్థాన్‌ సంచలనం

02 Nov, 16:17

రీపోలింగ్ అన్ని కేంద్రాల్లో నిర్వహించాలి: షర్మిల డిమాండ్

02 Nov, 16:14

ఎన్నికల సంఘం అధికార పార్టీకి కొమ్ముకాయడం దారుణం: జగన్

02 Nov, 16:14

హైదరాబాద్‌లో పాదయాత్రకు ముందు కాంగ్రెస్‌పై అమిత్‌ షా ఆసక్తికర పోస్ట్‌!

02 Nov, 16:07

బెంగళూరు ఆసుపత్రికి జగన్.. రాప్తాడు బాధితురాలికి పరామర్శ

02 Nov, 15:59

పల్లీలు తింటే అల్జీమర్స్‌ ముప్పు తగ్గుతుందా? తాజా అధ్యయనం ఏం చెబుతోంది?

02 Nov, 15:56

టూత్ బ్రష్ నుంచి తలగడ వరకు... ఈ వస్తువులు ఎప్పుడు మార్చాలో తెలుసా?

02 Nov, 15:54

ప్రకటనల స్థానంలో పోర్న్‌ వీడియోలు.. పలు దేశాల్లో డిజిటల్‌ బోర్డ్‌లు హ్యాక్‌!

02 Nov, 15:48

చంద్రబాబు వచ్చాక ఏపీని బీహార్‌లా మార్చేశారు: విడదల రజని

02 Nov, 15:38

ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరం ఏదో తెలుసా?

02 Nov, 15:35

రాప్తాడు ఉన్మాది ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల‌ కీలక ప్రకటన.. కాలు కోల్పోనున్న హేమంత్?

02 Nov, 15:27

యువ సంచలనాన్ని నిరుత్సాహపరుస్తున్నారు: టీమిండియాపై శ్రీకాంత్ అసంతృప్తి

02 Nov, 15:21
..More Telugu News