పబ్లిక్‌లో 'కావ్య, కావ్య' అరుపులు.. సిగ్గుతో నవ్వేసిన అనిరుధ్!
Advertisement
- చెన్నై రన్స్ ఈవెంట్‌లో పాల్గొన్న సంగీత దర్శకుడు అనిరుధ్
- కాబోయే భార్య కావ్య మారన్ పేరుతో నినాదాలు చేసిన అభిమానులు
- ఫ్యాన్స్ అరుపులకు సిగ్గుతో మురిసిపోయిన అనిరుధ్
Advertisement
ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు అనిరుధ్ రవిచందర్‌కు అభిమానుల నుంచి ఓ సరదా అనుభవం ఎదురైంది. నిన్న జరిగిన 'చెన్నై రన్స్ 2026' ఈవెంట్‌లో ఆయన పాల్గొన్నారు. అక్కడ అభిమానులతో అనిరుధ్ మాట్లాడుతుండగా, ఒక్కసారిగా వారు కాబోయే భార్య కావ్య మారన్ పేరుతో "కావ్య, కావ్య" అంటూ నినాదాలు చేయడం ప్రారంభించారు. దీంతో అనిరుధ్ సిగ్గుతో నవ్వుతూ కనిపించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ కార్యక్రమంలో అనిరుధ్.. నయనతార నటించిన 'కొలమావు కోకిల' సినిమాలోని తన పాప్యులర్ సాంగ్ 'కల్యాణ వయసు'ను ఆలపించారు. ప్రస్తుతం ఆయన పెళ్లికి సిద్ధమవుతున్న తరుణంలో ఈ పాట పాడటం, దానికి అభిమానులు కావ్య పేరుతో నినాదాలు చేయడం ఆసక్తికరంగా మారింది. అభిమానుల అల్లరిని చూసి అనిరుధ్ కూడా నవ్వుతూ వారిని ఉత్సాహపరిచారు. ఈవెంట్ ముగిశాక హాజరైన వారితో సెల్ఫీ కూడా దిగారు.
సన్ గ్రూప్ ఛైర్మన్ కళానిధి మారన్ కుమార్తె అయిన కావ్య, ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓగా వ్యవహరిస్తున్నారు. వీరి వివాహం నవంబర్ 10, 11 తేదీల్లో గ్రీస్‌లో అత్యంత సన్నిహితుల మధ్య జరగనుంది. అనంతరం నవంబర్ 21న చెన్నైలో భారీ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు.
కావ్య తల్లిదండ్రులు కళానిధి, కావేరి మారన్‌లు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి రిసెప్షన్‌కు స్వయంగా ఆహ్వానించారు. ఇప్పటికే పెళ్లి పనులు వేగంగా జరుగుతున్నాయి. ఐవరీ, పౌడర్ బ్లూ రంగుల్లో రూపొందించిన వీరి ఆహ్వాన పత్రిక అందరినీ ఆకట్టుకుంది. ఈ రిసెప్షన్‌కు ప్రధాని మోదీ, తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ సహా రాజకీయ, వ్యాపార, సినీ, క్రీడా రంగాలకు చెందిన పలువురు ప్రముఖులను ఆహ్వానించినట్టు సమాచారం.