పోలీసు శాఖకు వన్నె తెచ్చిన వ్యక్తి బాలసుబ్రహ్మణ్యం సమర్థుడైన అధికారి: సీఎం చంద్రబాబు నివాళి

Andhra
Advertisement
  • విశ్రాంత ఐపీఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యం పార్థివదేహానికి నివాళులర్పించిన చంద్ర‌బాబు
  • క్యాన్సర్‌తో పోరాడుతూనే విధుల్లో కొనసాగారని గుర్తు చేసుకున్న ముఖ్యమంత్రి
  • టెక్నాలజీతో పాలనలో విప్లవాత్మక మార్పులు తెచ్చారని కొనియాడిన సీఎం
  • ఆయన మృతి పోలీసు శాఖకు తీరని లోటు అని వ్యాఖ్య
Advertisement
విశ్రాంత ఐపీఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యం హఠాన్మరణం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన పార్థివదేహానికి నివాళులర్పించిన అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. బాలసుబ్రహ్మణ్యం అత్యంత సమర్థుడైన, ప్రజాహితం కోరిన అధికారని కొనియాడారు. పదవీ విరమణ చేసిన రెండు నెలలకే ఆయన మృతి చెందడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

బాలసుబ్రహ్మణ్యం మూడు దశాబ్దాల పాటు పోలీసు శాఖలో అందించిన సేవలను చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. "ఉమ్మడి రాష్ట్రంలో జగిత్యాల లాంటి సమస్యాత్మక ప్రాంతాల్లో పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నారు. ఆర్టీసీ ఎండీగా సంస్థను సమర్థంగా నడిపించారు. టెక్నాలజీపై ఆయనకు ఉన్న ఆసక్తితో 'ఈ-ప్రగతి' వంటి విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు. ప్రతి విభాగంలోనూ తనదైన ముద్ర వేసి సంస్కరణలు అమలు చేశారు" అని చంద్రబాబు ప్రశంసించారు.

క్యాన్సర్‌తో పెద్ద యుద్ధమే చేస్తూ, చికిత్స పొందుతూ కూడా విధులను నిర్వర్తించారని సీఎం గుర్తుచేసుకున్నారు. రాష్ట్ర విభజన సమయంలో బాలసుబ్రహ్మణ్యం చాలా బాధపడ్డారని తెలిపారు. పోలీసు శాఖకు వన్నె తెచ్చిన గొప్ప అధికారిని కోల్పోయామని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చంద్రబాబు పేర్కొన్నారు.
Advertisement

సంబంధిత వార్తలు

BalasubrahmanyamChandrababu NaiduRetired IPS OfficerAndhra Pradesh PoliceRTC MDePragati

More Telugu News

రూ.800 కోట్ల క్లబ్‌లోకి 'జైలర్ 2'.. కోలీవుడ్‌లో రజనీకాంత్ సరికొత్త రికార్డ్!

02 Nov, 13:08

ఆవలింతలు ఎందుకు వస్తాయి? ఎదుటివారు ఆవలిస్తే మనకూ ఎందుకు వస్తుంది?

02 Nov, 12:50

పబ్లిక్‌లో 'కావ్య, కావ్య' అరుపులు.. సిగ్గుతో నవ్వేసిన అనిరుధ్!

02 Nov, 12:43

61 ఏళ్లలోనూ అదే ఫిట్‌నెస్.. షారుక్ ఖాన్ సీక్రెట్ ఇదే!

02 Nov, 12:38

ఇండియా కూటమి ర్యాలీ వల్ల రూ. 11 వేల కోట్ల నష్టం.. ఎవరు చెల్లిస్తారన్న వ్యాపార సంఘాలు

02 Nov, 12:26

ఏఐకి భౌతిక రూపం.. 'మ్యాక్స్' హ్యూమనాయిడ్ రోబోను పరిచయం చేసిన మెటా!

02 Nov, 12:17

రాప్తాడు దాడిలో గాయపడిన బాలిక ఆరోగ్యంపై మంత్రి లోకేశ్‌ కీలక అప్‌డేట్‌

02 Nov, 12:16

నవంబర్ 11 నుంచి కేటీఆర్ బస్సు యాత్ర.. 29న భారీ బహిరంగ సభ

02 Nov, 12:02

పంజాబ్‌లో ఆప్‌కు షాక్‌.. రాజీనామా చేసిన గంటల్లోనే బీజేపీలో చేరిన ముగ్గురు ఎమ్మెల్యేలు!

02 Nov, 11:57

పులివెందుల పులి అన్నారు.. ఓటేయకుండా వెళ్లారు: జగన్‌పై అచ్చెన్న విమర్శలు

02 Nov, 11:48

రైలు బోగీల రంగులు వేర్వేరుగా ఎందుకుంటాయో తెలుసా? నీలం, ఎరుపు, తెలుపు వెనుక అసలు కథ ఇదే!

02 Nov, 11:41

మురసు తుపానుపై పవన్ కల్యాణ్ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు

02 Nov, 11:35

ప్రేమలో దారుణంగా మోసపోయా: రెజీనా కసాండ్రా

02 Nov, 11:33

ఓట్‌ చోరీ జరిగితే రాహుల్‌, రేవంత్‌ ఎలా గెలిచారు?: రాంచందర్‌ రావు

02 Nov, 11:30
..More Telugu News