చైనా, రష్యాపై గూఢచర్యం చేస్తున్నాం.. వారికంటే మేమే బెటర్: ట్రంప్
Advertisement
- చైనా, రష్యా అమెరికాపై నిఘా పెట్టాయన్న ట్రంప్
- అమెరికా కూడా ఆ దేశాలపై గూఢచర్యం చేస్తున్నట్లు వెల్లడి
- ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని దెబ్బతీశామని వెల్లడి
- ఇరాన్‌తో చర్చలకు ఎవరూ ముందుకు రావడం లేదని వ్యాఖ్య
- యుద్ధం ముగిశాక చమురు ధరలు భారీగా తగ్గుతాయని అంచనా
Advertisement
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యంతర ఎన్నికల ప్రచారాన్ని ముగిస్తూ చైనా, రష్యాపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ దేశాలు అమెరికాపై నిఘా పెట్టినట్లే తాము కూడా వాటిపై నిఘా పెడుతున్నామని చెప్పారు. పైగా, వాటి కంటే మెరుగ్గా గూఢచర్యం చేయగలమని వ్యాఖ్యానించారు. ఇరాన్‌తో యుద్ధాన్ని సమర్థించుకున్నారు. ద్రవ్యోల్బణం తగ్గుతోందని, చమురు ధరలు కూడా దిగివస్తున్నాయని పేర్కొన్నారు.
అమెరికాపై చైనా, రష్యా గూఢచర్యం చేస్తున్నాయన్న ఆందోళనలను ట్రంప్ తోసిపుచ్చారు. అయోవాలోని డుబుక్‌లో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. చైనా, రష్యా అమెరికాపై నిఘా పెడుతున్నాయని తనకు తెలుసని చెప్పారు. తాము కూడా ఆ దేశాలపై నిఘా ఉంచుతున్నామని, ఈ విషయంలో తమదే పైచేయి అని వ్యాఖ్యానించారు.
ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని దెబ్బతీశామని ట్రంప్ పేర్కొన్నారు. ఆ దేశానికి రాడార్లు, వైమానిక రక్షణ ఆయుధాలు లేవని అన్నారు. నాయకులు కూడా లేకుండా చేశామని వ్యాఖ్యానించారు. చర్చలు జరిపేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని, అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు కూడా ఎవరూ సిద్ధంగా లేరని చెప్పారు. యుద్ధాన్ని తాము ప్రారంభించలేదని, ముగింపు దశకు తీసుకొస్తున్నామని పేర్కొన్నారు.
కాన్సస్‌లోని సలీనాలో జరిగిన మరో సభలో ట్రంప్ ఆర్థిక అంశాలపై మాట్లాడారు. గత మూడు నెలల్లో ద్రవ్యోల్బణం 1.7 శాతానికి తగ్గిందని తెలిపారు. మాజీ అధ్యక్షుడు జో బైడెన్ నుంచి అధిక ధరల సమస్యను వారసత్వంగా పొందానని, తాను దానికి కారణం కాదని అన్నారు. ఇరాన్ అణ్వాయుధాన్ని సంపాదించకుండా అడ్డుకున్నామని పేర్కొన్నారు. బరాక్ ఒబామా, బైడెన్ హయాంలతో పోలిస్తే ప్రస్తుతం చమురు ధరలు తక్కువగా ఉన్నాయని చెప్పారు. యుద్ధం ముగిసిన తర్వాత ధరలు భారీగా పడిపోతాయని అంచనా వేశారు. దేశ భద్రత, ప్రపంచ శాంతి కోసం ఇంధన ధరలు పెరగడం చిన్న మూల్యమేనని వ్యాఖ్యానించారు.
అమెరికాలో మంగళవారం మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయి. ప్రతినిధుల సభ, సెనెట్‌లపై ఆధిపత్యం కోసం ప్రధాన పార్టీల మధ్య పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో ట్రంప్ డుబుక్‌లో రెండు గంటలకు పైగా ప్రసంగించారు. అనంతరం సలీనాకు వెళ్లి చివరి ప్రచార సభలో పాల్గొన్నారు.