భూగర్భంలో దాక్కున్నా బయటకు లాగుతాం.. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు ఖర్గే హెచ్చరిక
Advertisement
- జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు ఖర్గే డిమాండ్
- ఢిల్లీలో ఇండియా కూటమి ‘ఢిల్లీ చలో’ ర్యాలీ
- మోదీ, అమిత్ షాపై ఖర్గే ఆరోపణలు
- ఓట్ల చోరీతో ప్రభుత్వాలు ఏర్పడ్డాయని విమర్శ
- ఈడీ, సీబీఐలకు భయపడబోమని స్పష్టీకరణ
Advertisement
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌పై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన భూగర్భంలో దాక్కున్నా బయటకు తీసుకొస్తామని వ్యాఖ్యానించారు. జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేసే వరకు పోరాటం ఆపబోమని స్పష్టం చేశారు. ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగాయంటూ సీఈసీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఇండియా కూటమి నిర్వహించిన ‘ఢిల్లీ చలో’ ర్యాలీలో ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ సభ చరిత్రాత్మకమని అభివర్ణించిన ఖర్గే.. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ఆరోపణలు గుప్పించారు. యువత, మహిళలు, మైనారిటీల ఓటు హక్కులను హరించేందుకు వారు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. జ్ఞానేశ్ కుమార్‌ను కాపాడేందుకు ప్రధాని, హోంమంత్రి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు, పోలీసులకు తాము భయపడబోమని చెప్పారు. ఈడీ, సీబీఐ వంటి సంస్థలను ఉపయోగించి ప్రతిపక్షాలను అణచివేయలేరని అన్నారు.
మహారాష్ట్ర, బిహార్, ఉత్తరప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఓట్ల చోరీతోనే అధికారంలోకి వచ్చాయని ఖర్గే ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే మోదీని అధికారంలో నుంచి తొలగించాలని పిలుపునిచ్చారు. ‘మోదీని తొలగించండి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి’ అని నినదించారు.
మరోవైపు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కూడా ఈ ర్యాలీపై స్పందించారు. ఇది ఏ ఒక్క పార్టీకి సంబంధించిన ఆందోళన కాదని, ప్రజల రాజ్యాంగ హక్కులను కాపాడేందుకేనని చెప్పారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) పేరుతో 13 కోట్ల మంది ఓటర్ల పేర్లను తొలగించడం ఆమోదయోగ్యం కాదని ఆయన విమర్శించారు. ఎన్నికల జాబితా పూర్తిగా పారదర్శకంగా ఉండాలని డిమాండ్ చేశారు.