నేటితో 53 ఏళ్లు.. ఐశ్వర్యారాయ్ డైట్ సీక్రెట్ ఇదే..!
Advertisement
- ఐశ్వర్యారాయ్ ఆహారంలో ఇంటి భోజనానికే ప్రాధాన్యం
- ఉదయం ఓట్స్, బ్రౌన్ బ్రెడ్ వంటి అల్పాహారం
- మధ్యాహ్నం పప్పు, చపాతీ, కూరగాయలు
- రాత్రి తేలికపాటి భోజనం తీసుకుంటారని కథనాలు
- తాజా పండ్లు, నట్స్ స్నాక్స్‌గా తీసుకుంటారని సమాచారం
Advertisement
బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్ అందం, ఫిట్‌నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ఆమెకు నేటితో 53 ఏళ్లు. తన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆమె ఖరీదైన డైట్ ప్లాన్లు అనుసరిస్తారని చాలామంది అనుకుంటారు. కానీ ఆమె ఆహారపు అలవాట్లు మాత్రం చాలా సాదాసీదాగా ఉంటాయి. ఎన్డీటీవీ కథనం ప్రకారం, ఇంట్లో వండిన సాధారణ భోజనానికే ప్రాధాన్యం ఇస్తుంది. పప్పు, అన్నం, కూరగాయల వంటి సంప్రదాయ ఆహారమే తనకు ఇష్టమని గతంలో పలు ఇంటర్వ్యూల్లో వెల్లడించింది.
ఉదయం ఇలా మొదలు
ఐశ్వర్య ఉదయం నిద్రలేవగానే గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె కలుపుకొని తాగుతుంది. అల్పాహారాన్ని మాత్రం స్కిప్ చేయదు. బ్రౌన్ బ్రెడ్ టోస్ట్, ఓట్స్ వంటి పీచు పదార్థాలు, ప్రొటీన్లు ఉండే ఆహారాన్ని తీసుకుంటుందట.
మధ్యాహ్నం ఇంటి భోజనమే
లంచ్‌లో పప్పు, చపాతీ, ఉడికించిన కూరగాయలకు ప్రాధాన్యం ఇస్తుంది. అన్నం, పప్పు, కూరలతో కూడిన సాధారణ భారతీయ భోజనం తనకు ఎంతో ఇష్టమని ఆమె గతంలో పేర్కొంది. ప్రత్యేకమైన ఆహార నియమాల కంటే సమతుల్యమైన ఇంటి భోజనానికే ప్రాధాన్యం ఇస్తుంది.
రాత్రి తేలికపాటి ఆహారం
రాత్రిపూట తక్కువ పరిమాణంలో ఆహారం తీసుకుంటుంది. బ్రౌన్ రైస్, గ్రిల్డ్ ఫిష్, ఉడికించిన కూరగాయలు వంటి పదార్థాలు ఆమె డిన్నర్‌లో ఉంటాయని సమాచారం. రోజంతా ఒకేసారి ఎక్కువగా తినకుండా చిన్న చిన్న పరిమాణాల్లో ఆహారం తీసుకోవడం కూడా ఆమెకు అలవాటు.
జంక్ ఫుడ్‌కు దూరం
నూనెలో వేయించిన పదార్థాలు, జంక్ ఫుడ్ కంటే తాజా పండ్లు, కూరగాయలు, నట్స్‌కు ప్రాధాన్యం ఇస్తుంది. రోజంతా తగినంత నీరు తాగుతూ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకుంటుంది. యోగా, నడక వంటి శారీరక వ్యాయామాలకూ ప్రాధాన్యం ఇస్తుంది.