'అదుర్స్' బామ్మ ఇక లేరు.. సీనియర్ నటి వత్సల రాజగోపాల్ కన్నుమూత
Advertisement
- వయోభార అనారోగ్యంతో చెన్నైలో వత్సల రాజగోపాల్ తుదిశ్వాస
- 'అదుర్స్' చిత్రంలో ఎన్టీఆర్ బామ్మగా తెలుగువారికి సుపరిచితం
- 400కు పైగా చిత్రాలు, పలు టీవీ సీరియళ్లలో నటన
Advertisement
ప్రముఖ దక్షిణాది సీనియర్ నటి వత్సల రాజగోపాల్ (92) చెన్నైలో కన్నుమూశారు. గత కొంతకాలంగా వయోభార సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆమె మృతితో సినీ పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి.
నాటకరంగంలో విశేష గుర్తింపు పొందిన వత్సల, తన 60 ఏళ్ల వయసులో ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన 'రోజా' చిత్రంతో వెండితెరపై అడుగుపెట్టారు. ఆ తర్వాత తమిళం, తెలుగు భాషల్లో 400కు పైగా చిత్రాల్లో నటించి తనదైన ముద్ర వేశారు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు ఆమె సుపరిచితురాలే. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన 'అదుర్స్' చిత్రంలో బామ్మ పాత్రలో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి.
బామ్మ పాత్రలైనా, ఇతర సహాయక పాత్రలైనా వాటికి సహజత్వాన్ని అద్దడంలో ఆమె దిట్ట. సినిమాలతో పాటు పలు టీవీ సీరియళ్లలోనూ నటించి బుల్లితెర ప్రేక్షకులకు చేరువయ్యారు. వత్సల రాజగోపాల్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, నటీనటులు సంతాపం వ్యక్తం చేస్తూ ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. చెన్నైలోని పల్లావరంలో ఉన్న ఆమె నివాసంలో భౌతికకాయాన్ని సందర్శనార్థం ఉంచారు. శుక్రవారం సాయంత్రం క్రోమ్‌పేటలోని శ్మశానవాటికలో ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి.