సీఎం పర్యవేక్షణతో పెను నష్టం తప్పింది: మంత్రి అచ్చెన్నాయుడు

Andhra
Advertisement
  • అర్నబ్ తుపాను నష్టంపై అమలాపురంలో మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష
  • జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఈ రాత్రికే 100 శాతం విద్యుత్ పునరుద్ధరించాలని లక్ష్యం
  • తుపానుకు సుమారు 8 వేల విద్యుత్ స్తంభాలు, 36 సబ్‌స్టేషన్లు ధ్వంసం
Advertisement
అర్నబ్ తుపాను కారణంగా దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను చక్కదిద్దే పనులను ప్రభుత్వం ముమ్మరం చేసింది. మున్సిపాలిటీల పరిధిలో ఈ రాత్రిలోగా 100 శాతం విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని లక్ష్యంగా నిర్దేశించినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, కోనసీమ జిల్లా ఇన్‌చార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. అమలాపురంలోని విద్యుత్ శాఖ ఎస్‌ఈ కార్యాలయంలో ఆయన తుపాను నష్టంపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... అర్నాబ్ తుపాను తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ, ముఖ్యమంత్రి చంద్రబాబు ముందునుంచీ నిరంతరం పర్యవేక్షించడం వల్ల ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించగలిగామని చెప్పారు. మత్స్యకారులను సముద్రంలోకి వెళ్లకుండా ఆపడం వంటి చర్యలు సత్ఫలితాలనిచ్చాయన్నారు. అయితే, విద్యుత్ శాఖకు ఊహించని స్థాయిలో నష్టం వాటిల్లిందని, జిల్లావ్యాప్తంగా సుమారు 8,000 విద్యుత్ స్తంభాలు నేలకూలాయని, 36 సబ్‌స్టేషన్లు పూర్తిగా దెబ్బతిన్నాయని వివరించారు.

పునరుద్ధరణ పనులకు అవసరమైన సిబ్బంది, సామగ్రి అందుబాటులో ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు క్లిష్టంగా ఉన్నాయని తెలిపారు. గురువారం క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించిన ముఖ్యమంత్రి... తక్షణమే తెలంగాణ నుంచి 1,000 మంది సిబ్బందిని రప్పించారని చెప్పారు. అలాగే, తమిళనాడు ప్రభుత్వంతో చర్చించి అక్కడి నుంచి కూడా అదనపు సిబ్బందిని రప్పిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.
Advertisement

సంబంధిత వార్తలు

Kinjarapu AtchannaiduArnab CycloneChandrababu NaiduAndhra Pradesh Power RestorationAmalapuram Cyclone DamageTelangana Electricity Workers

More Telugu News

ఉత్తరాఖండ్ హెలికాప్టర్ ప్రమాదం విషాదాంతం.. ఆరుగురి మృతి

30 Oct, 19:23

ఎల్లమ్మ' కోసం డీఎస్పీ భారీ ప్రయోగం.. 100 మంది జానపద వాద్య కళాకారులతో టైటిల్ సాంగ్!

30 Oct, 18:34

ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ముగిసిన ప్రచారం.. ఎల్లుండే పోలింగ్

30 Oct, 18:20

బాలీవుడ్ నటి సారా అలీఖాన్‌పై ఫత్వా.. అండగా నిలిచిన హిందూ స్వామీజీ

30 Oct, 18:05

'అదుర్స్' బామ్మ ఇక లేరు.. సీనియర్ నటి వత్సల రాజగోపాల్ కన్నుమూత

30 Oct, 18:05

తమిళంలో నటుడిగా బిజీ.. సునీల్ రెడ్డి ఎవరి కుమారుడో తెలుసా?

30 Oct, 17:56

పండగ సీజన్‌లో హీరో కొత్త స్కూటర్‌.. డెస్టినీ 110 క్లాసిక్‌ ధర ఎంతంటే?

30 Oct, 17:26

'ఆదర్శ కుటుంబం' మూవీ రివ్యూ

30 Oct, 17:11

ఉప్పాడ రక్షణ గోడ పనులు వేగవంతం చేయండి.. తుపాను సహాయక చర్యలపై పవన్ సమీక్ష

30 Oct, 17:02

260 పరుగుల లక్ష్యం ముందు భారత్‌ తడబాటు.. న్యూజిలాండ్‌ ఘన విజయం

30 Oct, 16:54

విటమిన్ ‘డి’ లోపం.. ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? జాగ్రత్త!

30 Oct, 16:50

పులివెందులలో నామినేషన్లు వేసుకోలేకపోయారు.. చొక్కా మడత పెడతారా?: దేవినేని ఉమా

30 Oct, 16:41

ఐటీ, ఫార్మా షేర్ల జోరు.. వరుసగా రెండో రోజూ లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

30 Oct, 16:31

విశాఖ పోర్టులో అగ్నిప్రమాదం

30 Oct, 16:22
..More Telugu News