కొలువు కోసం సైగలతో దివ్యాంగుడి మొర.. 24 గంటల్లో ఉద్యోగం కల్పించిన సీఎం విజయ్
Advertisement
- ఉద్యోగం కోరుతూ సైగలతో విన్నవించుకున్న దివ్యాంగ యువకుడు
- తక్షణమే స్పందించి హామీ ఇచ్చిన తమిళనాడు సీఎం విజయ్
- కేవలం 24 గంటల్లోనే ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తూ ఉత్తర్వులు
- నియామక పత్రాన్ని స్వయంగా అందజేసిన ముఖ్యమంత్రి
- సీఎం విజయ్ చొరవపై సర్వత్రా ప్రశంసల వెల్లువ
Advertisement
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, ఓ దివ్యాంగ నిరుద్యోగి పట్ల మానవతా దృక్పథంతో స్పందించారు. ఉద్యోగం ఇప్పించాలని సైగలతో వేడుకున్న యువకుడికి కేవలం 24 గంటల్లోనే ప్రభుత్వ ఉద్యోగం కల్పించి తన హామీని నిలబెట్టుకున్నారు. ఇచ్చిన మాటను వెంటనే అమలు చేసిన ఈ ఘటనపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
వివరాల్లోకి వెళితే.. చెన్నై గిండిలోని ప్రభుత్వ వృత్తివిద్యా శిక్షణ సంస్థలో బుధవారం జరిగిన ఓ కార్యక్రమానికి సీఎం విజయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా దినేశ్ అనే దివ్యాంగ యువకుడు సీఎంను కలిసి, తాను నిరుద్యోగినని, జీవనం కష్టంగా ఉందని సైగలతో వివరిస్తూ ఓ వినతిపత్రాన్ని అందించాడు. అతని పరిస్థితిని అర్థం చేసుకున్న విజయ్, తప్పకుండా సాయం చేస్తానని అక్కడికక్కడే భరోసా ఇచ్చారు.
అనుకున్నదే తడవుగా, మరుసటి రోజైన గురువారం ఉదయం దినేశ్‌ను సచివాలయానికి పిలిపించారు. అక్కడ సీఎం విజయ్ స్వయంగా దినేశ్‌తో కరచాలనం చేసి, ఉద్యోగ నియామక పత్రాన్ని అందజేశారు. తిరువొత్తియూరులోని ప్రభుత్వ శిక్షణ కేంద్రంలో సహాయకుడి పోస్టును కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
విజ్ఞప్తి చేసిన ఒక్క రోజులోనే ఉద్యోగం రావడంతో దినేశ్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తన కష్టాన్ని అర్థం చేసుకుని తక్షణమే స్పందించిన సీఎం విజయ్‌కు అతడు కృతజ్ఞతలు తెలిపాడు. ప్రజాప్రతినిధులు సమస్యలపై వెంటనే స్పందించాలనడానికి ఈ ఘటన ఒక ఉదాహరణగా నిలిచింది.