తుపాను బాధితులకు అండగా నిలవండి: పార్టీ శ్రేణులకు జగన్ పిలుపు
Advertisement
- ప్రభుత్వ సహాయక చర్యలు పూర్తిగా విఫలమయ్యాయని జగన్ విమర్శ
- టీడీపీ నేతలు బియ్యం మాఫియాను ప్రోత్సహిస్తున్నారని ఆరోపణ
- సోనా మసూరి బియ్యం ధర కేజీ రూ.90 దాటిందని వ్యాఖ్య
Advertisement
అర్నబ్ తుపాను బాధిత ప్రాంతాల్లో ప్రజలకు అండగా నిలవాలని వైసీపీ అధినేత జగన్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో సహాయక చర్యలు విఫలమయ్యాయని విమర్శించారు. అధికార పార్టీ నేతలు 'బియ్యం మాఫియా'ను ప్రోత్సహిస్తూ కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.
తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి జిల్లా అధ్యక్షులు, రీజనల్ కో-ఆర్డినేటర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ... ‘గ్రామ, వార్డు సచివాలయాల నిర్వీర్యం, వాలంటీర్ల వ్యవస్థ రద్దు ప్రభావం తుపాను సహాయక చర్యలపై స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వం విపత్తులను ఆదాయ వనరుగా మార్చుకోవాలనుకుంటోంది’ అని విమర్శించారు. సోనా మసూరి బియ్యం ధర కేజీ రూ.90 దాటిందని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రభుత్వంలోని కీలక నేతలే బియ్యం ధరల పెరుగుదలకు కారణమని ఆరోపించారు. ‘మంత్రి పయ్యావుల వియ్యంకుడు సహా టీడీపీ నేతలు బియ్యాన్ని మార్కెట్లోకి రానీయకుండా బ్లాక్ చేసి, ఎక్స్‌పోర్టు చేస్తున్నారు. విపత్కర పరిస్థితుల్లోనూ బియ్యం మాఫియాను ప్రోత్సహిస్తున్నారు’ అని జగన్ వ్యాఖ్యానించారు.
తుపాను కారణంగా వరి, ఆక్వా, పండ్ల తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, ఈ క్లిష్ట సమయంలో బాధితులకు తోడుగా నిలవాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ధాన్యం సేకరణలో రైతులకు అండగా ఉంటూ, ప్రతి గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేసేలా ఒత్తిడి తీసుకురావాలని జగన్ స్పష్టం చేశారు.