ఏఐ ప్రమాదకరం: డీప్ ఫేక్ వీడియోలపై కృతి సనన్ పోరాటం

Entertainment
Advertisement
  • ఏఐ దుర్వినియోగంపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కృతి సనన్
  • తన వ్యక్తిత్వ, ప్రచార హక్కుల పరిరక్షణకు పిటిషన్
  • టెక్నాలజీపై ఇటీవల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన నటి
Advertisement
ప్రముఖ బాలీవుడ్ నటి కృతి సనన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) దుర్వినియోగంపై న్యాయపోరాటానికి దిగారు. తన వ్యక్తిత్వ, ప్రచార హక్కులను (పర్సనాలిటీ అండ్ పబ్లిసిటీ రైట్స్) కాపాడాలంటూ ఆమె ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఏఐ టెక్నాలజీని ఉపయోగించి తన అనుమతి లేకుండా డీప్‌ఫేక్ వీడియోలు, ఫేక్ ఎండార్స్‌మెంట్లు సృష్టించకుండా అడ్డుకోవాలని ఆమె కోరారు.

ఈ పిటిషన్‌పై జస్టిస్ పురుషైంద్ర కుమార్ కౌరవ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. వ్యక్తిత్వ హక్కులకు సంబంధించిన అంశాలపై మరిన్ని వివరాలు, గత తీర్పులను సమర్పించాలని కృతి తరఫు న్యాయవాదులను ఆదేశిస్తూ, తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.

ఇటీవల ఒక కార్యక్రమంలో మాట్లాడిన కృతి సనన్, ఏఐ టెక్నాలజీ తనను తీవ్రంగా భయపెడుతోందని వ్యాఖ్యానించారు. "ఏఐ ఒక పదునైన కత్తి లాంటిది, అది ఎంత పదునుగా ఉంటే అంత ప్రమాదకరం" అని ఆమె అన్నారు. సోషల్ మీడియాలో ఏఐ ద్వారా సృష్టించిన తన ఫొటోలను రిపోర్ట్ చేయడానికి సరైన నిబంధనలు కూడా లేవని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆమె కోర్టును ఆశ్రయించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Advertisement

సంబంధిత వార్తలు

Kriti SanonArtificial IntelligenceDeepfake videosDelhi High CourtPersonality rightsBollywood news

More Telugu News

తుపాను బాధితులకు భారీ ప్యాకేజి ప్రకటించిన చంద్రబాబు.. ఎవరికి ఎంత.. పూర్తి వివరాలు ఇవిగో!

28 Oct, 20:14

ఇంట్లోనే సినిమా హాలు.. ఎల్‌జీ కొత్త టీవీ ధర, ఫీచర్లు ఇవే!

28 Oct, 20:13

పులివెందుల ఓటమిని జీర్ణించుకోలేకే జగన్ సవాళ్లు: మంత్రి సత్యకుమార్

28 Oct, 20:10

‘రావణుడు పూర్తిగా చెడ్డవాడు కాదు’.. సాయిపల్లవి వ్యాఖ్యలపై సోషల్‌ మీడియాలో చర్చ!

28 Oct, 19:49

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న చంద్రబాబు.. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా

28 Oct, 19:43

తుపాను వేళ ఏపీకి అండగా తెలంగాణ ప్రభుత్వం.. సాయానికి సిద్ధమన్న భట్టి

28 Oct, 19:39

అమ్మాయిలు అదరహో.. జింబాబ్వేపై భారత్ క్లీన్ స్వీప్

28 Oct, 19:33

రూ.1,500తో ఏడాది టోల్‌ ప్రయాణాలు.. ఎవరికి వర్తిస్తుందంటే?

28 Oct, 19:28

రూ.200 కూపన్‌తో రూ.50 లక్షల కారు.. ఆరేళ్ల బాలుడికి అదృష్టం!

28 Oct, 19:23

ఇంగ్లండ్ ఆటగాడితో వాగ్వాదం.. పాక్‌ బౌలర్‌కు భారీ జరిమానా.. ఇంకోసారి జరిగితే నిషేధమే!

28 Oct, 18:53

ధోనీని తొలగించి స్మిత్ కు కెప్టెన్సీ.. ఆ నిర్ణయంతో అందరం షాకయ్యాం: డుప్లెసిస్

28 Oct, 18:31

పులివెందులలో వైసీపీకి ఎదురుదెబ్బ.. టీడీపీలోకి 20 కుటుంబాలు

28 Oct, 18:31

ఆ చట్టంతో డిజిటల్ మీడియా స్వేచ్ఛకు ముప్పు లేదు: కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టత

28 Oct, 18:16

బ్యాలెట్‌ పేపర్లతో ఎన్నికలు.. కాంగ్రెస్‌ ఖాతా తెరిచిందా?: మోదీ సెటైర్‌

28 Oct, 18:14
..More Telugu News