ఏపీని వణికిస్తున్న అర్నబ్ తుపాను.. వేర్వేరు ఘటనల్లో 7 మంది మృతి

Andhra
Advertisement
  • అర్నబ్ తుపాను కారణంగా ఏపీలో విషాద ఘటనలు
  • రాష్ట్రవ్యాప్తంగా వేర్వేరు ఘటనల్లో ఏడుగురు మృతి
  • కరెంట్ స్తంభాలు, చెట్లు కూలి పలువురి దుర్మరణం
  • విశాఖ, పశ్చిమగోదావరి, కోనసీమ, అనకాపల్లి జిల్లాల్లో మరణాలు
Advertisement
ఏపీలో అర్నబ్ తుపాను విషాదాన్ని మిగిల్చింది. తుపాను ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో చోటుచేసుకున్న వేర్వేరు ఘటనల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు.

వివరాల్లోకి వెళితే, విశాఖపట్నంలో రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మరణించారు. పాత గోశాల సమీపంలో విద్యుత్ స్తంభం కూలి ఒకరు మృతి చెందగా, సింహాచలం బాలాజీనగర్‌లో బిందు అనే వివాహిత ప్రాణాలు కోల్పోయారు. 

పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోనూ ఇద్దరు మృత్యువాత పడ్డారు. చర్చి వద్ద చెట్టు విరిగిపడటంతో చొక్కా కిశోర్ (45), బొండాడవారి వీధిలో కరెంట్ స్తంభం పడటంతో రాంబాబు (34) దుర్మరణం చెందారు.

ఇక, కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేదికర ప్రకాశ్ పురంలో ఓ వృద్ధురాలు మరణించారు. పెను గాలులకు గుడిసె కూలిపోవడంతో కొల్లు వెంకాయమ్మ అనే మరో వృద్ధురాలు మరణించారు. అదేవిధంగా అనకాపల్లి జిల్లా ఎలమంచిలిలో విద్యుత్ షాక్‌కు గురై మరో మహిళ మృతి చెందారు. పలు జిల్లాల్లో విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరగడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.
Advertisement

సంబంధిత వార్తలు

Cyclone ArnabAndhra Pradesh rainsCyclone deaths APVisakhapatnam weatherCyclone Arnab updatesHeavy rainfall deaths

More Telugu News

కెప్టెన్ స్మిత్ మచ్చర్ తలపై బలమైన గాయం.. ఎన్ని కుట్లో..! ఫొటో పంచుకున్న ఏపీ బీజేపీ

28 Oct, 17:05

అర్నబ్ తుపానుతో ఇప్పటికే కుండపోత.. ఏపీకి మరో 7 రోజుల పాటు భారీ వర్ష సూచన

28 Oct, 17:04

వైసీపీ ఓటు బ్యాంక్ ఇంకా తగ్గాలి.. రాష్ట్రం బాగుపడాలంటే అదే మార్గం: సీఎం చంద్రబాబు

28 Oct, 16:39

ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు వాయిదా.. కొత్త తేదీలు ఇవే!

28 Oct, 16:23

ఆటో షేర్ల జోరు.. అయినా నష్టాల్లోనే ముగిసిన స్టాక్ మార్కెట్

28 Oct, 16:23

రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన నడుస్తోంది: కాంగ్రెస్ సర్కార్‌పై హరీశ్ రావు ధ్వజం

28 Oct, 16:21

తుపాను ప్రభావం తగ్గే వరకు క్షేత్ర స్థాయి విధుల్లోనే ఉండాలి: అధికారులకు పవన్ ఆదేశం

28 Oct, 16:14

అటక మీద దొరికిన పాత విత్తనాలు.. ఇటలీ రైతు దశ మార్చిన అద్భుత పంట!

28 Oct, 15:54

లాస్ ఏంజిల్స్‌లో 'రామాయణ' స్పెషల్ స్క్రీనింగ్.. సోషల్ మీడియాలో టాక్ ఇదే!

28 Oct, 15:53

'దహాన్' (ఆహా) మూవీ రివ్యూ!

28 Oct, 15:41

ఈ నెలాఖరున దాన కిశోర్ పదవీ విరమణ.. గవర్నర్ స్పెషల్ సీఎస్‌గా పునర్నియామకం

28 Oct, 15:37

టాటా గ్రూప్‌ను నాశనం చేస్తున్నారు: మోదీ, అమిత్ షాలపై రాహుల్ గాంధీ ఫైర్

28 Oct, 15:24

రాడార్ టెక్నాలజీ, రైడ్ హైట్ ఫీచర్ తో 'ట్రయంఫ్' బైక్.. ఆగినప్పుడు ఎత్తు తగ్గే సీటు!

28 Oct, 15:20

టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. 6 కంపెనీల బోర్డుల నుంచి వైదొలగనున్న నోయెల్ టాటా

28 Oct, 15:19
..More Telugu News