శిల్పారావు మైక్ కట్ వివాదం: వివరణ ఇచ్చిన కుత్లే ఖాన్
Advertisement
- శిల్పారావు కన్సర్ట్ వివాదంపై స్పందించిన కుట్లే ఖాన్
- నిర్వాహకుల వల్లే అంతా జరిగిందని వీడియోలో వివరణ
- శిల్పా మైక్ ఆఫ్ అవడం దురదృష్టకరమని వ్యాఖ్య
- ఆమె మాట్లాడేటప్పుడు నేను ప్రదర్శన ఆపానని వెల్లడి
- శిల్పారావు తనకు సోదరి లాంటిదని, ట్రోలింగ్ బాధించిందని ఆవేదన
Advertisement
ముంబైలో ఇటీవల నిర్వహించిన బాలీవుడ్ మ్యూజిక్ ప్రాజెక్ట్ (బీఎంపీ) వేదికగా చోటుచేసుకున్న వివాదంపై జానపద గాయకుడు కుట్లే ఖాన్ స్పందించారు. గాయని శిల్పా రావు ప్రదర్శనను అర్ధాంతరంగా నిలిపివేయడం పట్ల సోషల్ మీడియాలో తనపై వస్తున్న విమర్శలకు వివరణ ఇస్తూ ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో సందేశాన్ని పోస్ట్ చేశారు.
ఈ కార్యక్రమంలో శిల్పా రావు ప్రదర్శన ఇస్తుండగా, ఒక్కసారిగా ఆమె మైక్ కనెక్షన్‌ను నిలిపివేశారు. ఆ వెంటనే కుట్లే ఖాన్ ప్రదర్శన ప్రారంభం కావడంతో నెటిజన్లు ఆయనను తప్పుబడుతూ విమర్శలు గుప్పించారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. "కార్యక్రమంలో ప్రతి కళాకారుడికి నిర్వాహకులు కొంత సమయాన్ని కేటాయిస్తారు. అయితే శిల్పా రావు ప్రదర్శన మధ్యలో మైక్, లైట్లు నిలిచిపోవడం చాలా దురదృష్టకరం. నిజానికి అలా జరగాల్సింది కాదు, కానీ సాంకేతికంగా అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు" అని పేర్కొన్నారు.
వాస్తవానికి తనకు కేటాయించిన 20 నిమిషాల సమయాన్ని నిర్వాహకులు గణనీయంగా కుదించారని, తన ప్రదర్శన కూడా ఎనిమిది నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైందని కుట్లే ఖాన్ వెల్లడించారు. తాను వేదికపైకి వచ్చాక కూడా శిల్పా రావు ప్రేక్షకులతో మాట్లాడుతుండటం గమనించి, ఆమె పూర్తి చేసే వరకు వేచి చూశానని తెలిపారు. అయితే, ఇన్-ఇయర్ మానిటర్ల ద్వారా తన ప్రదర్శనను వెంటనే కొనసాగించాలని నిర్వాహకులు ఒత్తిడి చేయడంతోనే తాను ప్రారంభించాల్సి వచ్చిందని ఆయన వివరించారు.
శిల్పా రావు తనకు సోదరి వంటివారని, ఆమె పట్ల తనకు ఎంతో గౌరవం ఉందని కుట్లే ఖాన్ అన్నారు. ఈ ఘటన నేపథ్యంలో ఆన్‌లైన్‌లో జరుగుతున్న ట్రోలింగ్ పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ, దయచేసి విమర్శలు ఆపాలని కోరారు.