వెంకటేశ్ సినిమాకు గుడ్ న్యూస్.. టికెట్ ధరల పెంపుకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్
Advertisement
- వెంకటేశ్ ‘ఆదర్శ కుటుంబం AK47’కు టికెట్ ధరల పెంపు
- మల్టీప్లెక్స్‌లో రూ.75, సింగిల్ స్క్రీన్‌లో రూ.50 అదనపు వసూలుకు ఛాన్స్
- రోజుకు ఐదు షోలు ప్రదర్శించుకునేందుకు వెసులుబాటు
Advertisement
విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన ‘ఆదర్శ కుటుంబం AK47’ సినిమాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ సినిమా టికెట్ ధరలను పెంచుకునేందుకు, రోజుకు ఐదు షోలు ప్రదర్శించుకునేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సినిమా విడుదలకు రెండు రోజుల ముందే ఈ అనుమతి లభించడంతో చిత్ర బృందానికి పెద్ద ఊరట లభించింది.
తాజా ఉత్తర్వుల ప్రకారం... రాష్ట్రవ్యాప్తంగా మల్టీప్లెక్స్‌లలో ఒక్కో టికెట్‌పై రూ.75, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.50 వరకు అదనంగా వసూలు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. చిత్ర నిర్మాత ఎస్. రాధాకృష్ణ (హారికా అండ్ హాసిని క్రియేషన్స్) చేసిన విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజీత్ ఉత్తర్వులు జారీ చేశారు. టికెట్ ధరల పెంపునకు సంబంధించి అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు, లైసెన్సింగ్ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్, ఫ్యామిలీ డ్రామాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించింది. గతంలో వెంకటేశ్ హీరోగా, త్రివిక్రమ్ రచయితగా ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ వంటి విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.