'బ్లాక్ నైట్ బాయ్స్'.. మరో సినిమా మొదలుపెట్టిన నటి దేవయాని కుమార్తె

Entertainment
Advertisement
  • నటి దేవయాని కుమార్తె ప్రియాంక రాజకుమరన్ కొత్త సినిమా ప్రారంభం
  • 'బ్లాక్ నైట్ బాయ్స్' పేరుతో సెట్స్ పైకి వెళ్లిన కొత్త చిత్రం
  • టీవీ నటుడు అమల్‌జిత్ హీరోగా నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్
  • 'ప్రేమిస్తే' ఫేమ్ జాషువా శ్రీధర్ సంగీతం, మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ
  • సెంబర్ వి. మురుగేశన్ దర్శకత్వంలో భారీ సాంకేతిక బృందంతో నిర్మాణం
Advertisement
సుస్వాగతం', 'చెన్నకేశవరెడ్డి', 'నాని' వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన నటి దేవయాని. ఇప్పుడామె కుమార్తె ప్రియాంక రాజకుమరన్ హీరోయిన్‌గా బిజీ అవుతున్నారు. ఇటీవల 'రంజన్: ది అడ్వకేట్' చిత్రంతో కథానాయికగా అరంగేట్రం చేసిన ఆమె, తాజాగా తన కొత్త సినిమాను ప్రారంభించారు. 'బ్లాక్ నైట్ బాయ్స్' పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైంది. 

కాగా, ప్రముఖ తమిళ దర్శకుడు రాజకుమరన్ నటి దేవయాని భర్త అని తెలిసిందే. వీరికి ఇద్దరు కుమార్తెలు.. ఇనియ పెద్ద కుమార్తె కాగా, ప్రియాంక చిన్న కుమార్తె. ఇనియ గాయనిగా కెరీర్ నిర్మించుకుంటోంది. ప్రియాంక తల్లిబాటలో నటిగా అడుగులు వేస్తోంది. గతంలో దర్శకుడిగా స్టార్ హీరోలతో సినిమాలు చేసిన రాజకుమరన్ ప్రస్తుతం నటుడిగా కొనసాగుతున్నారు.

ఈ చిత్రంలో సోషల్ మీడియాలో పాపులర్ అయిన అమల్‌జిత్ హీరోగా నటిస్తున్నారు. సెంబర్ వి. మురుగేశన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. యువతను లక్ష్యంగా చేసుకుని, ఓ అందమైన ప్రేమకథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా 'బ్లాక్ నైట్ బాయ్స్' ఉంటుందని నిర్మాతలు పేర్కొన్నారు.

ఈ సినిమాకు ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేస్తుండటం విశేషం. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస కెమెరా బాధ్యతలు చేపట్టారు. 'కాదల్' వంటి కల్ట్ క్లాసిక్ చిత్రానికి సంగీతం అందించిన జోషువా శ్రీధర్ ఈ సినిమాకు స్వరాలు సమకూరుస్తున్నారు. బాబా భాస్కర్ నృత్యరీతులు, పి.సి. స్టంట్స్ ఫైట్స్ అందిస్తున్నారు. అరుణ్ మురుగన్ పిక్చర్, డ్రీమ్ రన్‌వే సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
Advertisement

సంబంధిత వార్తలు

Priyanka RajakumaranDevayani daughter movieBlack Knight BoysAmaljithRajakumaranTamil cinema updates

More Telugu News

వెంకీ-త్రివిక్రమ్ 'ఆదర్శ కుటుంబం' చిత్రానికి సెన్సార్ పనులు పూర్తి

26 Oct, 20:51

హైదరాబాద్ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య హత్య కేసు: ఐదు నెలల తర్వాత నేపాలీ ముఠా అరెస్ట్

26 Oct, 20:44

పోలీసులను ఆశ్రయించిన విజయ్-రష్మిక టీమ్.. నెగటివ్ ప్రచారంపై ఫిర్యాదు

26 Oct, 19:57

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త.. త్వరలో ఫైనల్ బిల్లులు!

26 Oct, 19:45

భోగి'లో అనుపమ డబ్బింగ్ అద్భుతం.. 1960ల యాసలో అదరగొట్టిందన్న సంపత్ నంది!

26 Oct, 19:22

రేపు, ఎల్లుండి సొంత నియోజకవర్గంలో జగన్ పర్యటన

26 Oct, 19:16

అర్ణబ్ తుపాను: రేపు, ఎల్లుండి అతి భారీ వర్షాలు.. గంట గంటకూ పరిస్థితి సమీక్షిస్తోన్న చంద్రబాబు

26 Oct, 18:44

'వాన్‌గార్డ్ డాక్ట్రిన్'.. భారత్‌పై అల్‌ఖైదా కుట్ర.. మళ్లీ పాత వ్యూహానికే పదును!

26 Oct, 18:29

కుమార్తె ప్రేమ గురించి సునీల్ శెట్టికి అలా తెలిసింది!

26 Oct, 18:22

హీరోయిన్లతో కేటీఆర్ దుబాయ్ వెళ్లారు: వెంకట్ బల్మూర్

26 Oct, 18:21

'ఖలీఫా' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ!

26 Oct, 18:02

జనసేనకు మద్దతుగా హైపర్ ఆది ప్రచారం

26 Oct, 18:01

విరాట్‌, రోహిత్‌ల తర్వాతి సూపర్‌స్టార్‌ వచ్చేశాడు.. యువ ఆటగాడిపై క్లూసెనర్‌ ప్రశంసలు!

26 Oct, 17:22

ఇలాగైతే ప్రజల మద్దతు పొందలేరు.. ఆ పార్టీ దుకాణం సర్దేసుకోవడం మంచిది: మంత్రి అనగాని

26 Oct, 17:19
..More Telugu News