విశాఖ స్థానిక ఎన్నికలు: 'సేల్' వర్సెస్ 'సేవ్'.. వైసీపీ కొత్త నినాదం
Advertisement
- విలువైన నగర భూములను కార్పొరేట్లకు అమ్ముతున్నారని వైసీపీ ఆరోపణ
- ప్రభుత్వంపై మేయర్ అభ్యర్థి వరుదు కల్యాణి, మాజీ మంత్రుల విమర్శలు
- 'సేవ్ విశాఖ' పేరుతో ప్రత్యేక పోస్టర్ ఆవిష్కరించిన వైసీపీ నేతలు
Advertisement
గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) ఎన్నికలు 'సేల్ విశాఖ', 'సేవ్ విశాఖ' మధ్య జరుగుతున్నాయని వైసీపీ మేయర్ అభ్యర్థి, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, మాజీ మంత్రులు కూరసాల కన్నబాబు, గుడివాడ అమర్నాథ్ అన్నారు. వైసీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ 'సేవ్ విశాఖ' పేరుతో ఓ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం విలువైన నగర భూములను కార్పొరేట్ సంస్థలకు నామమాత్రపు ధరలకు కట్టబెడుతోందని, తద్వారా నగరాన్ని 'సేల్ విశాఖ'గా మారుస్తోందని వారు ఆరోపించారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి కన్నబాబు మాట్లాడుతూ... పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా వేల ఎకరాలను కార్పొరేట్లకు అప్పగించడం ఏంటని మండిపడ్డారు. తాము అధికారంలోకి వస్తే 'బ్లూ విశాఖ' పేరుతో బీచ్‌ల అభివృద్ధి, పర్యాటకం, పారిశుద్ధ్యం, తాగునీరు, పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తామని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించడమే తమ లక్ష్యమని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి హామీ ఇచ్చారు.