ఎస్సై ప్రియాంకపై గుంటూరు ఎస్పీకి విడదల రజని ఫిర్యాదు
Advertisement
- మహిళా ఎస్సై తనతో అనుచితంగా ప్రవర్తించి కిందకు తోసేశారని రజని ఆరోపణ
- రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని విమర్శ
- ఎస్సైపై చర్యలు తీసుకోకపోతే కోర్టుకు వెళతామని హెచ్చరిక
Advertisement
మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు విడదల రజని చిలకలూరిపేటలో జరిగిన పరిణామాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనతో అనుచితంగా ప్రవర్తించి, కిందకు తోసివేసిన ఎస్సై ప్రియాంకపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె గుంటూరు జిల్లా ఎస్పీ జగదీశ్‌కు అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఎస్ఐపై సరైన చర్యలు తీసుకోకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు.
ఎస్పీని కలిసిన అనంతరం విడదల రజని మాట్లాడుతూ... రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధమైన పాలన జరగడం లేదని, కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే అమలవుతోందని ఆరోపించారు. పోలీసులు చట్టాన్ని కాపాడాల్సింది పోయి, అధికార పార్టీకి మద్దతుగా నిలుస్తున్నారని విమర్శించారు. చిలకలూరిపేటలో తమ పార్టీ అభ్యర్థులను బెదిరింపులకు గురిచేస్తూ, కిడ్నాప్‌లు చేసి నామినేషన్లు ఉపసంహరించుకునేలా ఒత్తిడి చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఇలాంటి బెదిరింపులకు భయపడబోమని, ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలు సరికాదని అన్నారు.