సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 'మీసాల బాబు' వీడియో.. ఇది నిజమా, ఫేకా?
Advertisement
- మీసంతో ఉన్న నవజాత శిశువు వీడియో నెట్టింట‌ వైరల్
- ఇది నిజమా, ఫేకా అని నెటిజన్ల మధ్య విస్తృత చర్చ
- శిశువు ముఖంపై ఉన్న మీసం, గడ్డంపై అనుమానాలు
- ఇది ఏఐ ఫిల్టర్ లేదా ఎడిటింగ్ అయి ఉంటుందని భావిస్తున్న నిపుణులు
- వీడియోకు సంబంధించి లేని ఎలాంటి అధికారిక సమాచారం
Advertisement
సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది వైరల్ అవుతుందో చెప్పలేం. తాజాగా ఓ నవజాత శిశువుకు సంబంధించిన వీడియో ఒకటి ఇంటర్నెట్లో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో ఆ పసికందుకు దట్టమైన మీసం, చిన్నపాటి గడ్డం ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ వీడియో నిజమా? లేక ఎడిటింగ్ చేసిందా? అనే దానిపై నెటిజన్ల మధ్య తీవ్ర చర్చ జరుగుతోంది.
టిక్టాక్తో పాటు పలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో షేర్ అయిన ఈ క్లిప్లో, ఆసుపత్రి బెడ్పై ఉన్న ఓ శిశువు అటూ ఇటూ కదులుతూ కనిపిస్తాడు. ఓ మహిళ ఆ చిన్నారితో మాట్లాడుతుండటం కూడా వీడియోలో ఉంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. 'పుట్టగానే బాధ్యతలు నెత్తికెత్తుకున్న మధ్యవయస్కుడిలా ఉన్నాడు' అంటూ సరదాగా కామెంట్లు పెడుతున్నారు.
అయితే, ఈ వీడియో ప్రామాణికతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా కొంతమంది శిశువులు పుట్టినప్పుడు వారి శరీరంపై 'లానుగో' అనే సన్నని వెంట్రుకలు ఉంటాయి. కానీ, అవి చాలా పలుచగా, లేత రంగులో ఉంటాయి. వీడియోలో కనిపిస్తున్నంత దట్టంగా, నల్లగా ఉండవని వైద్యులు చెబుతున్నారు. వీడియోను నిశితంగా పరిశీలించిన కొందరు, శిశువు కదులుతున్నప్పుడు మీసం స్థిరంగా లేకపోవడం, లైటింగ్కు తగ్గట్టుగా నీడలు సరిగ్గా లేకపోవడం వంటివి గమనించారు.
ఈ కారణాలతో నిజమైన వీడియోపై ఏఐ ఫిల్టర్ లేదా డిజిటల్ ఓవర్లే ఉపయోగించి దీనిని సృష్టించి ఉండవచ్చని చాలామంది భావిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ వీడియోకు సంబంధించి ఎలాంటి అధికారిక ధ్రువీకరణ గానీ, కుటుంబ సభ్యుల వివరాలు గానీ అందుబాటులో లేవు.