యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం
Advertisement
- వారణాసిలో గార్మెంట్ యూనిట్‌ను ప్రారంభించనున్న ప్రధాని
- నమో ఘాట్‌లో ఐఏఎఫ్ వైమానిక విన్యాసాలకు హాజరు
- భువనేశ్వర్‌లో ఆర్‌బీఐ డేటా సెంటర్, సైబర్ సెక్యూరిటీ ఇన్‌స్టిట్యూట్ ప్రారంభోత్సవం
Advertisement
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు (ఆదివారం) ఉత్తరప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన పలు కీలక అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు.
ఉత్తరప్రదేశ్ పర్యటనలో భాగంగా, వారణాసిలో ఉదయం 11 గంటలకు నూతనంగా ఏర్పాటు చేసిన గార్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ను ప్రధాని ప్రారంభిస్తారు. దేశీయంగా టెక్స్టైల్, అపెరల్ తయారీ రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు, ఈ ప్రాంతంలో పారిశ్రామిక వృద్ధిని పెంపొందించడం ఈ యూనిట్ ప్రధాన లక్ష్యం. అనంతరం వారణాసిలోని నమో ఘాట్లో నిర్వహించనున్న ఎయిర్ఫోర్స్ డే ఏరియల్ డిస్ప్లే-2026 కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతారు. భారత వాయుసేన 94వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ‘వింగ్స్ ఓవర్ గంగ’ ఇతివృత్తంతో ఈ వైమానిక ప్రదర్శనను నిర్వహిస్తున్నారు. ఇందులో తేజస్, ప్రచండ్, సుఖోయ్-30ఎంకేఐ, రఫేల్ వంటి అత్యాధునిక యుద్ధ విమానాలతో పాటు భారత నౌకాదళం, సైన్యానికి చెందిన విమానాలు సైతం తమ విన్యాసాలను ప్రదర్శించనున్నాయి.
అనంతరం ఒడిశా పర్యటనకు వెళ్లనున్న ప్రధాని, భువనేశ్వర్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) డేటా సెంటర్, సైబర్ సెక్యూరిటీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ను ప్రారంభిస్తారు. ఆర్బీఐ కంప్యూటింగ్ అవసరాలను తీర్చేలా, అత్యంత సురక్షితమైన, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా దీనిని తీర్చిదిద్దారు. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద టైర్-4 సర్టిఫైడ్ కేంద్రాలలో ఒకటిగా ఇది నిలవనుంది. ఈ కేంద్రం దేశవ్యాప్తంగా డిజిటల్ ఆర్థిక సేవల విస్తరణకు, సామర్థ్య పెంపునకు ఎంతగానో దోహదపడనుంది.