వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
Advertisement
- వైసీపీ ఐదేళ్ల పాలనలో మున్సిపాలిటీలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయని అశోక్ బాబు విమర్శ
- కేంద్ర నిధులను దారి మళ్లించి, చెత్త పన్నుతో ప్రజలపై భారం మోపారని ఆరోపణ
- లక్షలాది టిడ్కో ఇళ్లను నిర్లక్ష్యం చేసి, అసాంఘిక శక్తులకు అడ్డాగా మార్చారని ధ్వజం
- కూటమి ప్రభుత్వం భారీ బడ్జెట్‌తో పట్టణాల అభివృద్ధికి పునరంకితమైందని వెల్లడి
- స్థానిక ఎన్నికల్లో వైసీపీకి ఓటమి ఖాయమని, ప్రజలు బుద్ధి చెబుతారని వ్యాఖ్య
Advertisement
గత వైసీపీ పాలనలో రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు పూర్తిగా సర్వనాశనమయ్యాయని, పట్టణాలను విధ్వంసం చేసి ప్రజలపై మోయలేని భారం మోపిన జగన్ కు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ నేత పర్చూరి అశోక్ బాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ హయాంలో జరిగిన అరాచకాలను, ప్రస్తుత కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను వివరించారు.
నిధుల దారి మళ్లింపు.. విధ్వంసకర పాలన
జగన్ పాలనలో జరిగిన అతిపెద్ద విధ్వంసం కేంద్ర ఆర్థిక సంఘం నుంచి పట్టణాలు, పంచాయతీలకు రావాల్సిన నిధులను ఆయన సొంత పథకాలకు దారి మళ్లించడమేనని అశోక్ బాబు ఆరోపించారు. "నేపాల్లో భూకంపం వస్తే 15-20 సెకన్లలో ఎలా అతలాకుతలమైందో, జగన్ ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలోని మున్సిపాలిటీల పరిస్థితి కూడా అచ్చం అలాగే తయారైంది. మురుగు కాల్వల్లో చల్లడానికి బ్లీచింగ్ పౌడర్ కూడా కొనలేని దుస్థితికి స్థానిక సంస్థలను దిగజార్చారు" అని ఆయన విమర్శించారు. కేంద్రం నుంచి వచ్చిన వేల కోట్ల రూపాయలను దారి మళ్లించడంతో, కేంద్రమే నేరుగా స్థానిక సంస్థల ఖాతాల్లోకి నిధులు జమ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఇది రాష్ట్ర పరపతిని ఢిల్లీ స్థాయిలో దెబ్బతీసిందని మండిపడ్డారు.
పన్నుల భారం.. పేదల కడుపు కొట్టిన వైనం
టీడీపీ హయాంలో పేదల ఆకలి తీర్చిన అన్న క్యాంటీన్లను కక్షగట్టి మూసివేసి పేదల కడుపు కొట్టారని అశోక్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. "చెత్త మీద పన్ను వేసి, నెలకు రూ.20 కట్టకపోతే పంపు కనెక్షన్లు కట్ చేస్తామని ప్రజలను బెదిరించారు. అలా వసూలు చేసిన రూ.200 కోట్లకు పైగా సొమ్ము ఎవరి జేబుల్లోకి వెళ్లింది?" అని ప్రశ్నించారు. అంతేకాకుండా, అద్దె ఆధారిత ఇంటి పన్ను విధానాన్ని మార్చి, ఆస్తి విలువ ఆధారంగా పన్నులు పెంచి ప్రజలపై తీవ్ర భారం మోపారని, గతంలో రూ.6,000 ఉన్న తన ఇంటి పన్నే నేడు రూ.15,000 అయ్యిందంటే సామాన్యుల పరిస్థితి ఏంటని నిలదీశారు.
టిడ్కో ఇళ్లు, పేదల ఇళ్ల స్థలాల్లో భారీ స్కామ్లు
పేదల ఆత్మగౌరవ ప్రతీకలైన టిడ్కో ఇళ్లను శిథిలావస్థకు చేర్చి, అసాంఘిక శక్తులకు అడ్డాలుగా మార్చిన పాపం వైసీపీదేనని అశోక్ బాబు విమర్శించారు. "టీడీపీ నిర్మించిన లక్షలాది ఇళ్లను పేదలకు ఇవ్వకుండా ఐదేళ్లు నిర్లక్ష్యం చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వాటికి మరమ్మతులు చేసి లబ్ధిదారులకు అప్పగిస్తోంది. పేదలకు సెంటు స్థలం పేరుతో నివాసయోగ్యం కాని భూములను రూ.6,000 కోట్ల భారీ స్కామ్తో కొనుగోలు చేసి, వైసీపీ నేతలు పంచుకున్నారు" అని ఆయన ఆరోపించారు.
కూటమి పాలనలో పట్టణాలకు పూర్వవైభవం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పట్టణాల అభివృద్ధికి మహర్దశ పట్టిందని అశోక్ బాబు తెలిపారు. "జగన్ తన పాలనలో ఏనాడూ రూ.7,000 కోట్లకు మించి బడ్జెట్ ఇవ్వలేదు. కానీ మేము ఏకంగా రూ.14,000 కోట్లు కేటాయించాం. రూ.2,500 కోట్లతో 6,000 కిలోమీటర్ల రోడ్లను బాగు చేశాం, 883 కిలోమీటర్ల అంతర్గత సీసీ రోడ్లు పూర్తి చేశాం. 269 అన్న క్యాంటీన్లు పునఃప్రారంభించి రోజుకు 2 లక్షల మందికి భోజనం పెడుతున్నాం" అని వివరించారు. ఆగిపోయిన అమృత్, జల్ జీవన్ మిషన్ పథకాలకు రాష్ట్ర వాటా నిధులు విడుదల చేయడంతో, రూ.16,000 కోట్ల విలువైన ప్రాజెక్టులతో ప్రతి ఇంటికీ తాగునీరు అందుబాటులోకి రానుందని తెలిపారు.
పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని, వారికి రూ.1 కోటి ప్రమాద బీమా అందిస్తున్నామని, చెత్త సేకరణకు 2,000 బ్యాటరీ వాహనాలను ప్రవేశపెట్టామని అశోక్ బాబు పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇచ్చిన అదనపు నామినేషన్ల గడువు ముగిసినా, వైసీపీ ప్రచారం చేసుకున్నట్లుగా నామినేషన్లు వెల్లువెత్తలేదని, వారి డ్రామాలు ఫలించలేదని అన్నారు. చేసిన అభివృద్ధిని చెప్పుకోవడానికి ఒక్క పని కూడా లేని వైసీపీ, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడం ఖాయమని, పట్టణ ప్రజలే వారికి తగిన బుద్ధి చెబుతారని అశోక్ బాబు జోస్యం చెప్పారు.