‘రామాయణ’ ముందు భారీ సవాల్.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతో తెలుసా?
- భారీ అంచనాలతో వస్తున్న 'రామాయణ'
- బడ్జెట్ దాదాపు రూ.2000 కోట్లు అంటూ ప్రచారం
- లాభాల బాట పట్టాలంటే రూ.5000 కోట్లు వసూలు చేయాలంటున్న విశ్లేషకులు!
- భారీ ఓపెనింగ్స్ తప్పనిసరి అని, తొలిరోజే రూ.200 కోట్ల గ్రాస్ అవసరమని అంచనా
- ప్రస్తుతం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా పరిమిత షోలకు రూ.7.52 కోట్లు వసూలు
- సినిమా లాభాల్లో కీలకం కానున్న థియేట్రికల్ ఆదాయంతో పాటు శాటిలైట్, డిజిటల్ హక్కులు
భారత సినీ పరిశ్రమలో అత్యంత భారీ బడ్జెట్‌తో, ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం 'రామాయణ: పార్ట్ 1'. నితీశ్ తివారీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా బడ్జెట్ దాదాపు రూ. 2000 కోట్లుగా ప్రచారంలో ఉంది. ఈ స్థాయిలో భారీ పెట్టుబడి పెట్టినప్పుడు, సినిమా లాభాల బాట పట్టడం అంత సులభం కాదు.
ట్రేడ్ విశ్లేషకుల అంచనాలను ఉటంకిస్తూ ఇండియా టుడే కథనం ప్రకారం.. ఈ సినిమా పెట్టిన పెట్టుబడిని తిరిగి రాబట్టి లాభాల్లోకి వెళ్లాలంటే ప్రపంచవ్యాప్తంగా కనీసం రూ. 5000 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించాల్సి ఉంటుంది. సాధారణంగా బడ్జెట్‌కు 2.5 రెట్ల వసూళ్లు వస్తేనే సినిమాను విజయవంతమైనదిగా పరిగణిస్తారు.
ఈ భారీ లక్ష్యాన్ని చేరుకోవాలంటే సినిమాకు ఆకాశమంత ఓపెనింగ్స్ అవసరమని ట్రేడ్ నిపుణుడు రమేశ్ బాల అభిప్రాయపడ్డారు. దేశీయంగా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే రూ. 75 కోట్ల నుంచి రూ. 100 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా ప్రీ-సేల్స్ ద్వారా రూ. 150 కోట్ల నుంచి రూ. 200 కోట్లు వసూలు చేయడం ఆరంభానికి ఎంతో కీలకమని ఆయన విశ్లేషించారు.
ఇక, తొలిరోజు భారత్‌లో రూ. 100-125 కోట్ల నెట్ కలెక్షన్లు, ప్రపంచవ్యాప్తంగా రూ. 175-200 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధిస్తే, సినిమాకు బలమైన పునాది పడుతుందని భావిస్తున్నారు. దేశీయ వసూళ్లలో దక్షిణాది మార్కెట్ల నుంచి 35-40 శాతం ఉంటుందని అంచనా వేస్తున్నారు.
అక్టోబర్ 22 నాటికి పరిమిత సంఖ్యలో అందుబాటులో ఉన్న షోల కోసం జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా సుమారు 1.33 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి. దీని ద్వారా రూ. 7.52 కోట్లు సమకూరాయి. అయితే, భారీ బడ్జెట్ చిత్రం కావడంతో కేవలం ఓపెనింగ్స్ మీదే ఆధారపడలేరు. సినిమాకు మంచి మౌత్ టాక్ వస్తేనే లాంగ్ రన్లో నిలదొక్కుకోగలదు. కేవలం థియేట్రికల్ వసూళ్లే కాకుండా, శాటిలైట్, డిజిటల్, ఇతర హక్కుల అమ్మకాల ద్వారా కూడా నిర్మాతలకు పెద్ద మొత్తంలో ఆదాయం సమకూరనుంది.
రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా, యశ్ రావణుడిగా, రవి దూబే లక్ష్మణుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని యశ్ నిర్మాణ సంస్థ మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్, నమిత్ మల్హోత్రాకు చెందిన ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాను నవంబర్ 5న దీపావళి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనుండగా, నవంబర్ 4న ప్రత్యేక ప్రీమియర్ షోలు ప్రదర్శించనున్నారు.