ఫిట్నెస్ సాధిస్తే తీసుకుంటామన్నారు.. తర్వాత ఫోన్ ఎత్తలేదు.. మెసేజ్‌కు రిప్లై ఇవ్వలేదు: కోహ్లీపై అమిత్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు
- జట్టులోకి తిరిగి వస్తావని కోహ్లీ హామీ ఇచ్చాడని అమిత్ మిశ్రా వెల్లడి
- గాయం నుంచి కోలుకున్నాక ఫోన్లు, సందేశాలకు కోహ్లీ స్పందించలేదని ఆరోపణ
- అప్పటి కోచ్ అనిల్ కుంబ్లే కూడా పునరాగమనంపై భరోసా ఇచ్చాడని వెల్లడి
- 2017లో ఇంగ్లాండ్‌తో టీ20 మ్యాచ్‌లో గాయపడిన మిశ్రా
- బెంగళూరులో జరిగిన ఆ మ్యాచ్ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ అయిందని వెల్లడి
టీమిండియాలోకి తిరిగి వస్తావంటూ విరాట్ కోహ్లీ హామీ ఇచ్చాడని, పూర్తిగా ఫిట్నెస్ సాధించిన తర్వాత తన ఫోన్లు, సందేశాలకు మాత్రం స్పందించలేదని భారత మాజీ లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా వెల్లడించాడు. అప్పటి కోచ్ అనిల్ కుంబ్లే కూడా గాయం నుంచి కోలుకున్నాక జట్టులోకి తిరిగి వస్తావని భరోసా ఇచ్చాడని చెప్పాడు. అయితే, ఆ హామీలు ఆచరణలోకి రాలేదని పేర్కొన్నాడు.
ఆకాశ్ చోప్రాతో కలిసి ‘బైఠ్ అండ్ బోల్’ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న మిశ్రా ఈ విషయాలను వెల్లడించాడు. 2017లో బెంగళూరులో ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో గాయపడటం తన అంతర్జాతీయ కెరీర్‌పై ప్రభావం చూపిందని చెప్పాడు. అదే భారత్ తరఫున తనకు చివరి అంతర్జాతీయ మ్యాచ్ అయిందని తెలిపాడు.
ఆ మ్యాచ్‌లో కాలికి గాయమైన తర్వాత అప్పటి కోచ్ అనిల్ కుంబ్లేతో మాట్లాడినట్లు మిశ్రా చెప్పాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత జట్టులోకి తిరిగి వస్తావని కుంబ్లే భరోసా ఇచ్చాడని గుర్తుచేసుకున్నాడు.
ఆ తర్వాత కెప్టెన్‌గా ఉన్న విరాట్ కోహ్లీని కూడా సంప్రదించినట్లు తెలిపాడు. ఏం చేయాలని అడిగితే.. పూర్తిగా ఫిట్నెస్ సాధించి సిద్ధంగా ఉంటే జట్టులోకి వస్తావని కోహ్లీ చెప్పినట్లు మిశ్రా వెల్లడించాడు.
గాయం నుంచి కోలుకున్న తర్వాత కోహ్లీని మళ్లీ సంప్రదించి తన పునరాగమనంపై పరిస్థితి ఏంటని అడిగానని చెప్పాడు. వారం నుంచి పది రోజుల్లో సమాచారం ఇస్తానని కోహ్లీ చెప్పినట్లు తెలిపాడు. అయితే, వారం, రెండు వారాలు, మూడు వారాలు గడిచినా ఎలాంటి సమాధానం రాలేదని మిశ్రా అన్నాడు.
“ఫోన్ చేశాను. అతడు ఎత్తలేదు. సందేశం పంపినా స్పందన లేదు. మళ్లీ ఫోన్ చేశాను. అయినా సమాధానం రాలేదు. చివరకు నేనే వదిలేశాను. మనల్ని జట్టులోకి తీసుకోవాలని ఎవరికీ లేకపోతే మనం ఏం చేయగలం?” అని మిశ్రా ఆవేదన వ్యక్తం చేశాడు.
తనకంటే తీవ్రంగా గాయపడి, ఎక్కువ కాలం ఆటకు దూరంగా ఉన్న కొందరు ఆటగాళ్లు ఫిట్నెస్ సాధించగానే జట్టులోకి తిరిగి వచ్చారని మిశ్రా పేర్కొన్నాడు. కానీ తన విషయంలో అలా జరగలేదని, ఇప్పటివరకు తనకు ఎలాంటి సమాధానం రాలేదని చెప్పాడు.