Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రియదర్శి, నాగదుర్గ ‘ఇడుపు కాయితం’ విడుదల తేదీ ఖరారు

Priyadarshi Naga Durga Idupu Kayitham release date fixed
Advertisement
  • డిసెంబరు 11న ‘ఇడుపు కాయితం’ విడుదల
  • ప్రియదర్శి, నాగదుర్గ కీలక పాత్రల్లో నటన
  • వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వం
  • బన్నీ వాస్‌ నిర్మాణంలో తెరకెక్కుతున్న చిత్రం
  • విడుదలైన ‘గడప’ లిరికల్‌ వీడియో
Advertisement
ప్రియదర్శి, నాగదుర్గ కీలక పాత్రల్లో నటిస్తున్న ఫ్యామిలీ డ్రామా ‘ఇడుపు కాయితం’ విడుదల తేదీ ఖరారైంది. వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబరు 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. సుకుమార్‌ రైటింగ్స్‌తో కలిసి బన్నీ వాస్‌ వర్క్స్‌ పతాకంపై బన్నీ వాస్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. టైటిల్‌ ప్రకటనతోనే ఆసక్తి రేకెత్తించిన ఈ చిత్రం తెలంగాణ కుటుంబ నేపథ్యంతో తెరకెక్కుతోంది.

విడుదల తేదీ ప్రకటన నేపథ్యంలో శుక్రవారం చిత్ర బృందం ‘గడప’ పాట లిరికల్‌ వీడియోను విడుదల చేసింది. సురేశ్‌ బొబ్బిలి సంగీతం అందించిన ఈ పాటకు అభినయ శ్రీనివాస్‌ సాహిత్యం రాశారు. తేలు విజయ ఆలపించారు. ‘ఇడుపు కాయితం’ అంటే విడాకుల పత్రం అని అర్థం. ఈ పేరుతో రూపొందుతున్న సినిమా కుటుంబ సంబంధాలు, వాటి చుట్టూ సాగే కథతో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Advertisement
Advertisement
Priyadarshi
Idupu Kayitham
Naga Durga
Bunny Vas
Vamsi Reddy Dondapati
Idupu Kayitham Release Date

More Telugu News