డ్రగ్స్ కేసు... వైసీపీ నేత రోకళ్ల సత్యనారాయణపై పార్టీ వేటు
- డ్రగ్స్ కేసులో వైసీపీ నేత రోకళ్ల సత్యనారాయణ సస్పెన్షన్
- మే 25న కొచ్చి ఎయిర్‌పోర్టులో 3 కిలోల డ్రగ్స్‌తో అరెస్ట్
- కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి అనుచరుడిగా గుర్తింపు
డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ అయిన తమ పార్టీ నేత, కాకినాడ మాజీ కార్పొరేటర్ రోకళ్ల సత్యనారాయణ (సత్య)ను వైసీపీ సస్పెండ్ చేసింది. ఈ మేరకు పార్టీ అధిష్ఠానం క్రమశిక్షణా చర్యలు తీసుకుంటూ ఈరోజు ఆదేశాలు జారీ చేసింది. మే నెలలో జరిగిన అరెస్ట్ ఘటన ఆలస్యంగా మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో సత్యపై పార్టీ వేటు వేసింది.
వివరాల్లోకి వెళితే, గత మే 25న బ్యాంకాక్ నుంచి వచ్చిన రోకళ్ల సత్యనారాయణను కేరళలోని కొచ్చి విమానాశ్రయంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు కాకినాడకే చెందిన పందిరి అర్జున్ కుమార్‌ను కూడా అరెస్ట్ చేశారు. వారిద్దరి బ్యాగులను తనిఖీ చేయగా, సబ్బు బిళ్లల ఆకారంలో దాచిన సుమారు 3 కిలోల మాదకద్రవ్యాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
రోకళ్ల సత్యనారాయణ అరెస్ట్ అయిన విషయం ఇన్నాళ్లుగా బయటకు రాకపోగా, తాజాగా ఈ ఘటనపై మీడియాలో కథనాలు ప్రసారం కావడంతో వైసీపీ నాయకత్వం స్పందించింది. ప్రస్తుతం ఈ డ్రగ్స్ ఎక్కడికి తరలిస్తున్నారు, దీని వెనుక ఉన్న నెట్వర్క్ ఎవరనే కోణంలో కేరళ పోలీసులు, డీఆర్ఐ అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.