విజయ్ పార్టీకి రూ.13.3 కోట్ల విరాళాలు.. 99 శాతం ఇద్దరు మంత్రుల నుంచే!
- విజయ్ టీవీకేకు 2025-26లో రూ.13.3 కోట్ల విరాళాలు
- మొత్తం విరాళాల్లో ఆధవ్ అర్జున, ఆర్‌వీ రంజిత్‌కుమార్ నుంచే 99 శాతం విరాళాలు
- రూ.8.2 కోట్లు అందించిన ఆధవ్ అర్జున
- రంజిత్‌కుమార్ రూ.5 కోట్ల విరాళం
- అన్నాడీఎంకేకు రూ.161.35 కోట్లు, డీఎంకేకు రూ.191.19 కోట్ల విరాళాలు
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌కు చెందిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీకి 2025–26 ఆర్థిక సంవత్సరంలో రూ.13.3 కోట్ల స్వచ్ఛంద విరాళాలు అందాయి. ఈ మొత్తంలో దాదాపు 99 శాతం ఇద్దరు మంత్రుల నుంచే వచ్చినట్లు భారత ఎన్నికల సంఘానికి సమర్పించిన వివరాలు వెల్లడిస్తున్నాయి. క్రీడలు, ప్రజాపనుల శాఖ మంత్రి ఆధవ్ అర్జున, మరో మంత్రి ఆర్‌వీ రంజిత్‌కుమార్ ఈ విరాళాల్లో ప్రధాన భాగస్వాములుగా ఉన్నారు.
ఎన్నికల సంఘానికి సమర్పించిన వివరాల ప్రకారం.. ఆధవ్ అర్జున రూ.8.2 కోట్లు విరాళంగా ఇచ్చారు. రంజిత్‌కుమార్ రూ.5 కోట్లు అందించారు. దీంతో పార్టీకి అందిన మొత్తం విరాళాల్లో అర్జున వాటా 60 శాతానికి పైగా ఉంది. టీవీకేకు అత్యధికంగా విరాళం ఇచ్చిన వ్యక్తిగా ఆయన నిలిచారు. ఈ ఇద్దరి విరాళాలతో పాటు మరో రెండు విరాళాలు కూడా పార్టీకి అందాయి. తూత్తుకుడి జిల్లా లయన్స్ టౌన్‌లో ఉన్న స్నో షో సంస్థ రూ.5 లక్షలు డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా ఇచ్చింది. అదే చిరునామాలో నమోదైన స్నో ఎక్స్‌పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ సంస్థ కూడా మరో రూ.5 లక్షలు డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో అందించింది. ఓవరాల్ గా ఈ నాలుగు విరాళాల మొత్తం రూ.13.3 కోట్లుగా ఉంది.
ఇదిలా ఉండగా 2025–26 ఆర్థిక సంవత్సరంలో అన్నాడీఎంకే సుమారు రూ.161.35 కోట్ల స్వచ్ఛంద విరాళాలు అందుకున్నట్లు ఎన్నికల సంఘం గణాంకాలు వెల్లడించాయి. ఇందులో టైగర్ అసోసియేట్స్ సంస్థ రూ.135 కోట్లతో అతిపెద్ద విరాళదారుగా నిలిచింది.
డీఎంకేకు ఇదే ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.191.19 కోట్ల విరాళాలు అందాయి. ఆ పార్టీకి కూడా టైగర్ అసోసియేట్స్ అత్యధికంగా రూ.125 కోట్లు ఇచ్చింది. కోల్‌కతాకు చెందిన ఈ లాటరీ సంస్థకు, తమిళనాడు లాటరీ వ్యాపారవేత్త శాంటియాగో మార్టిన్‌కు వ్యాపార సంబంధాలు ఉన్నట్లు కంపెనీ రికార్డులు సూచిస్తున్నాయి. ఆ సంస్థలో నియమిత భాగస్వామిగా ఉన్న సుబ్బయన్ నాగరాజన్.. మార్టిన్‌కు చాలాకాలంగా వ్యాపార సహచరుడిగా ఉన్నట్లు సమాచారం.
సుప్రీంకోర్టు 2024 ఫిబ్రవరిలో ఎన్నికల బాండ్ల పథకాన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే. అంతకుముందు ఆ బాండ్లను అత్యధికంగా కొనుగోలు చేసిన సంస్థగా మార్టిన్‌కు చెందిన ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ సంస్థ నిలిచింది. పథకం రద్దు తర్వాత బహిర్గతమైన వివరాల ప్రకారం.. ఈ సంస్థ ఎన్నికల బాండ్ల ద్వారా డీఎంకేకు రూ.509 కోట్ల విరాళాలు అందించింది.